సోమవారం, జూన్ 18, 2007

నా కందపద్యం!

కం.అందం కావాలన్నా
పొందిక క్లుప్తత సరళత పొందాలన్నా
కందమె తప్పనిసరియని
చందస్సు తెలిసిన కవిగ చకచక చెప్తా.

9 కామెంట్‌లు:

rākeśvara చెప్పారు...

మీరిలా మాట్లాడడానికీ, వ్యాఖ్యానించడానికీ కందాలు చకచకా అల్లేస్తుంటే, ఒక కందానికి నాలుగు గంటలు తీసుకునే నాలాంటి వాళ్ళకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వసుందండి :)
Nice to meet you and your blog.

అజ్ఞాత చెప్పారు...

meeru vraasina kandapadyamlO chinna sandEham:

"kluptata" anE padam vaaDaaru kadaa, alaanTappuDu mundu gaNamlO 4 maatralu kaaka 5 maatralu unnaTTunnaayi. idi kandapadyamlO nishiddham kadaa?

naaku telisi kluptata is actually klptata (alu, alU ani chadivi unTaamu, acchulO, adi).

aa vidhamgaa chooste mee padyam chandObaddham gaa undi.

Good one.

రాఘవ చెప్పారు...

చిన్న clarification: నేను వ్రాసిన పద్యంలో క్లుప్తత ను 'klptata' గా తీసుకున్నా 'kluptata' గా తీసుకున్నా తేడా వుండదు. అసమాసమైతే సంయుక్తద్విత్వాక్షరాలు ముందు అక్షరాన్ని గురువుగా మార్చవు.

రాఘవ చెప్పారు...

Actually, because of the limitations in typesetting which has no "ऌ" available, I had to use క్లుప్తత. The word is actually derived from Samskrtam and is klptata with an "ऌ".

Sandeep P చెప్పారు...

comments dwaaraa chat cheyyaDam kashTam gaa undi.

naa sandEham EmiTi anTE:

U | U U | |
poM di ka klu pta ta

U | | U | |
poM di ka kl pta ta

Sandeep P చెప్పారు...

Oh - got it. As I mentioned, it is a good one.

Sandeep P చెప్పారు...

Oh - sorry. I didn't know about asamaana... principle.

చిన్నమయ్య చెప్పారు...

పద్యంలో మీరన్నది నిజమే! కందము రాసిన వాడే కవి పెద్దలు ఊరకే అన్నారా?
నాలుగవ రాష్ట్రపతిగారి సతీమణి కమలమ్మ గారు అప్పట్లో ఆంధ్ర పత్రికలో "క" అని పద్యాలు రాస్తూవుండేవారట. అవి కంద పద్యాలు కావని విమర్శలు వెల్లువెత్తడంతో, " అవి కంద పద్యాలు కావు. కమల పద్యాలు" అని వారు సెలవిచ్చేరట.

రానారె చెప్పారు...

చిన్నమయ్యగారూ, కందము రాసిన వాడే కవి అన్నారు సరే, ఎన్నాళ్లైనా ఇంకా కందాలే రాసుంకుంటూ వుండేవాణ్ణి పెద్దలేమీ అనలేదాండి? :)