మంగళవారం, జూన్ 12, 2007

తారకమంత్రము

కం.మననముచే రక్షించే
ధ్వనినే మంత్రమని యెరిగి ధరణిజపతియౌ
ఘనచరితుని ఘనశ్యాముని
మనసున రాముని తలచెద మధునామంబున్.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

adbhutamngaa vraaSaaru anDi.

అజ్ఞాత చెప్పారు...

రాఘవ గారు,
"మధునామంబున్" సరైన ప్రయోగమేనంటారా? మధుసూదనడు అంటే మధు అనే రాక్షసుడిని చంపినవాడు, కృష్ణుడు కదా.
సందేహ నివృత్తికోసం అడిగానంతే, రంధ్రాన్వేషణ కాదండీ.

రాఘవ చెప్పారు...

మధు అనే సంస్కృత విశేషణ శబ్దానికి తీయని,ఆహ్లాదకరమైన,హాయినిచ్చే,... అని అర్థాలు. మధునామము అంటే తియ్యని పేరు అని అర్థం. 'మధు'ని యిక్కడ విశేషణంగా తీసుకోవాలి.