సోమవారం, జూన్ 04, 2007

సమస్య 6

ఒక్క వచనంలో తేడా సమస్యాపూరణాన్ని ఎలా మార్చేయగలదో!

1. పరకాంతను కోరె నేకపత్నీవ్రతుడై.

2. పరకాంతల కోరె నేకపత్నీవ్రతుడై.

12 కామెంట్‌లు:

Naga Pochiraju చెప్పారు...

అయ్యా!!ఈ సమస్య లో పరకాంత/పరకాంతలు ల ప్రయోగం లో singular/plural కాకుండా ఎమైనా విశిష్టత ఉందా

రాఘవ చెప్పారు...

పూరణ మారుతుందండీ, అంతే.

Sandeep P చెప్పారు...

చురచుర చూపులతూపులు,
విరిజాజుల ఘుమఘుమలును వివశునిజేయున్
దరికింజేరగవలదని
పరకాంతలగోరెనేక పత్నీవ్రతుడై

Sandeep P చెప్పారు...

I know that it is a pretty bad way of samasyaapUraNam, but I just wanted to highlight the fact that kOrenu means: requesting &/ desired

రాఘవ చెప్పారు...

బావుందండి.

రాఘవ చెప్పారు...

ఏకవచన ప్రయోగానికి పూరణ:

కం.హరి రామునిగా యుండగ
ధరజన్ గొనిపోవలదని అభ్యర్థిస్తూ
సిరికై ధరిత్రిని తన అ
పర కాన్తను కోరె నేకపత్నీవ్రతుడై.

[సీతామాతని భూమి తీసుకొనిపోతుంటే శ్రీరాముడు(హరి)తన రెండవ(అపర)భార్యయైన భూదేవిని రామావతారంలో తను యేకపత్నీవ్రతుడిననీ,తన భార్యను తీసుకుపోవద్దనీ ప్రార్థించాడు.]

ఇకపోతే "పరకాన్తల కోరెనేకపత్నీవ్రతుడై" అన్న సమస్యని సందీప్ గారు పూరించినట్లుగా పూరిస్తేనే బావుంటుందని నా అభిప్రాయం కూడా (అలా అనుకునే ఆ సమస్య యిచ్చాను).

రాఘవ చెప్పారు...

నా పూరణ ఏమంత బాగోలేదు :( ఇంకొకటి ఆలోచించాలి

అజ్ఞాత చెప్పారు...

రాఘవ గారు,
ఇది చూడండి:
పురితిరిగొచ్చిన రాతిరి
మురిపెపు ఇల్లాలినిగని మరులే కలుగన్
మరితాళకసుమశరునం
పర, కాంతనుగోరెనేక పత్నీ వ్రతుడై

రాఘవ చెప్పారు...

బావుందండీ చాలా చక్కగా వుంది.

అజ్ఞాత చెప్పారు...

మీరేదో మొహమాటానికి బాగుంది అన్నారుగానీ, రెండో పాదం లో మురిపెపుటిల్లాలిని అనికదా ఉండాల్సింది?

రాఘవ చెప్పారు...

మీరలా అనేస్తే యెలా? :D

అజ్ఞాత చెప్పారు...

:)