గురువారం, ఫిబ్రవరి 24, 2011

వీడ్కోలిక ముళ్లపూడి వేంకటరమణా

వేడ్కఁ దెలుఁగుహాస్యము నీ
మాడ్కి రచించెడిదెవరయ మా బాపు సఖా
వీడ్కోలోయ్ బుకురుకుగుకు
వీడ్కోలిక ముళ్లపూడి వేంకటరమణా

5 కామెంట్‌లు:

మరువం ఉష చెప్పారు...

బాల [1945-1959] విహంగ వీక్షణ సంపుటికి మొదటిమాట కి ముళ్ళపూడివారు రాసిన మొదటిమాటలో -చిత్రకళ ని ధరించి, చలన చిత్రకళను వరించిన వెలుగు చిత్ర విరించి- బాపు అని తన ప్రాణ మిత్రుని గూర్చి మురిపెంగా అభివర్ణించారు. మీ పద్యాన్ని చదివగానే "బాపు సఖా" అన్న మాట దగ్గర ఆ మాటలు జ్ఞప్తికి వచ్చాయి. వీడ్కోలు పుచ్చుకున్నవారు తరలిపోతారు, ఇవ్వాల్సివచ్చినవారే క్రుంగిపోయేది.

Sanath Sripathi చెప్పారు...

వీరి ఎడబాటు మనజు తీరని లోటే !!

Unknown చెప్పారు...

బుడుగు వచ్చి మా నాన్నేడీ అని అడిగితే ఏం చేప్తాం?

SHANKAR.S చెప్పారు...

ఇన్నాళ్లుగ నీ రాతల్లో నువ్వొదిలిన
ఫన్నీలన్నీ ఇపుడు నువ్వు లేవంటూంటే
కన్నీళ్లు ఒక్కుదుటన ధారలవుతున్నాయి
విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా

అటు చూడు
"హన్నా" అంటూ బెదిరించే బుడుగు బేలగా ఏడుస్తున్నాడు
"ప్రైవేట్" చెప్పేందుకు ఎవరూ లేక బాబాయ్ భోరుమంటున్నాడు
"సెగట్రీ" నీ ఆర్డర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు
"అరుణ" 'అప్పు'డే ఋణం తీర్చుకోద్దంటోంది
"రాధా గోపాళం" రావా రమణా అని పిలుస్తున్నారు

సర్లే ఇవన్నీ వదిలేయి. అటు చూడు బాపు కళ్ళలో ...తన మనసు నీకు తెలీదని కాదు కానీ నువ్వు లేని బాపు ని చూస్తే ఆత్మ లేని శరీరాన్ని చూసినట్టు లేదూ? అయినా
నీ ఆత్మ బాపులో
బాపు ఆత్మ నీలో ఉన్నప్పుడు
తన అనుమతి లేకుండా
పరమాత్మను చేరే హక్కు నీ కెక్కడ రమణా?

Mauli చెప్పారు...

వీడ్కోలు రమణ గారికి.