శుక్రవారం, జులై 29, 2011

సోమాలియా

భగవన్! నీవు కృపాబ్ధి యండ్రు మఱి యీ బాలల్ ఘనాఘాత్ములా?
పగవారా? పసివారలయ్య భువిలో బాధానుభూతుల్ మదిన్
మిగులన్ జేతువ వారికిన్? కటకటా! మీ వైభవవ్యాప్తి నా
శుగజాప్తా దయఁజేసి మార్చఁగదవే సోమాలియాలో స్థితిన్

4 కామెంట్‌లు:

Sanath Sripathi చెప్పారు...

సోమాలియా వార్త హృదయాలను కలచి వేస్తే , దాని నాపమన్న మీ ఆర్తి తలపింప చేస్తోంది.

రవి చెప్పారు...

ఆర్తితో మీరు చేసిన ప్రార్థన లవలేశమైనా స్థితిని మారుస్తుందని ఆశపడుతున్నాను. భగవంతుడా! ఎక్కడున్నావయ్యా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! శుభమస్తు.
ఈ క్రింది లింక్ తెరచి చదివి, మీ బ్లాగులో ప్రకటించడం ద్వారా మీబ్లాగ్ పాఠకులకు అవధానానికి రావాలనుకొనేవారికి వచ్చే అవకాశం కల్పించ గలరని ఆశిస్తున్నాను.
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html

Bolloju Baba చెప్పారు...

గుండె బరువెక్కింది మిత్రమా