గురువారం, ఫిబ్రవరి 03, 2011

భీంసేన్ జోషీ

సంసార మసారంబని
హంసలు మానససరసికి నరిగెడి రీతిన్
మాంసమయదేహము విడిచి
భీంసేనుఁడు నాకమునకు విజయము జేసెన్ ౧

విడచెను తనువును
నంతియ?
విడచెను తన ఘనయశస్సు
విడచెను బాణీన్
విడచెను గళమును
మన కై విడచెను...

మనకై విడచెను
చాలవె మనకివి భీంసేనకృతుల్ ౨

2 కామెంట్‌లు:

Sandeep P చెప్పారు...

చక్కని పద్యాలతో భీంసేనుడికి నివాళిని అర్పించావు సోదరా. ఆయన జన్మ మనందరి అదృష్టమూ.

నువ్వు వ్రాసిన రెండవ పద్యం యే రీతో అర్థం కాలేదు. దయచేసి చెప్పగలవు.

రాఘవ చెప్పారు...

కందమేనండీ. కొంచెం క్రొత్తగా ఉంటుందని... ఎక్కడ ఎక్కడ విఱచి చదువుకోవాలో అక్కడ అక్కడ విఱచి వ్రాసాను, అంతే. :)