కృష్ణాజినం దర్భమయీ చ మౌఞ్జీ పాలాశదణ్డః పరిధానశాటీ।
యజ్ఞోపవీతఞ్చ దిశన్తు నిత్యం వటోశ్చిరాయుశ్శుభకీర్తివిద్యాః।।
కృష్ణ-అజినమ్ దర్భమయీ చ మౌఞ్జీ పాలాశ-దణ్డః పరిధాన-శాటీ యజ్ఞోపవీతమ్ చ దిశన్తు నిత్యమ్ వటోః చిరాయుః శుభ-కీర్తి-విద్యాః
కృష్ణజింకచర్మమూ, ముంజ-దర్భలతో చేయబడిన ఒడ్డాణమూ, మోదుగకఱ్ఱా, అంగవస్త్రమూ, జంధ్యమూ నిత్యమూ (నిత్యముగా) వటువుకి చిరాయువునీ శుభాన్నీ కీర్తినీ విద్యలనీ ఇచ్చుగాక.
4 కామెంట్లు:
మా తాత గారి (మాతామహులు) దగ్గర కృష్ణాజినం ఉండేది. ఆయన ఆ కృష్ణాజినం మీద కూర్చుని, సంధ్యావందనమూ, నిత్యపూజలూ చేసే వారు. ఆయనతో బాటు అన్నీ వెళ్ళిపోయాయి. నాకు పెట్టిన ఆయన పేరు మాత్రం మిగిలింది.
నిద్రపోవడం, భోజనం చేయడంలాగ సంధ్యావందనాదులు జీవితంలో అలవాటు కానంతవఱకూ ఇంతే! నా వఱకూ నేనూ దీనికి అతీతుణ్ణి కాదండీ! ఏమిటో కనీసం సంధ్యావందనం కూడా రోజూ చెయ్యడం లేదు ఈ మధ్యన! తోచినప్పుడు మూడు పూటలూ చేస్తాను, ఒక్కొక్కసారి కనీసం ప్రాతస్సంధ్య కూడా చేయను! నిత్యసంధ్యావందనాదులు ఎలాగైనా అలవఱచుకోవాలండీ! దీనిని వ్యసనంగా మార్చుకుంటే చాలండీ, మనస్సే పీక్కుతింటుంది చేసేవఱకూ :)
ఈ శ్లోకం ఎందులోదో తెలుపగలరు.
మన సంకల్పమే మనబలం.ప్రాతఃసంధ్య 108సార్లు గాయత్రీ జపంతో కలిపి 15ని॥ల లోపు పడుతుంది,సావకాశంగా చేసుకుంటే.
వేగంగా అయితే 10ని॥లు చాలు.
కాలాను గుణంగా,సంధ్యావందనం సూక్ష్మంగాకూడ వుంది.
నేను అదేఫాలో అవుతాను.
ముప్పూటలా చేసే అవకాశం,సావకాశం లేకపోతే కనీసం ప్రాతఃసంధ్యావందనమైనా చేసుకుంటే మంచిది.
పేరూరు ద్రావిడులు సూక్ష్మంగా సంధ్యావందనం పుస్తకాన్ని ఉపనయనాలసమయంలో వచ్చినవారికి పంచుతారు(శక్తివున్నవారు).అది మనకి అనుకూలంగా సింపుల్ గా వుంటుందని నాభావన.
కామెంట్‌ను పోస్ట్ చేయండి