జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః।
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః।।
జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తాః రాఘవమస్తకే చ విలసత్ కున్దప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయకాన్తికలితాః యాః ఇన్ద్రనీలాయితాః ముక్తాః తాః శుభదాః భవన్తు భవతామ్ శ్రీరామవైవాహికాః
జానకి యొక్క కమలములవలె అమలములైన దోసిళ్లలో ఏవైతే పద్మరాగాలైనాయో, రాఘవుని మస్తకమునందు ఉంచబడినవై ఏవి కుందప్రసూనాలలాగ విలసిల్లాయో, తలపైనుండి జారి ఆ రాముని శ్యామలకాయకాంతితో కలిసినవై ఏవి ఇంద్రనీలాలయ్యాయో, ఆ శ్రీరామవైవాహికములైన ముత్యాలు మీకు శుభాలని ఇచ్చేవి అగుగాక.
న్యస్తాః + రాఘవమస్తకే = న్యస్తా రాఘవమస్తకే
స్రస్తాః + శ్యామలకాయకాన్తికలితాః = స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితాః
కలితాః + యాః = కలితా యాః
యాః + ఇన్ద్రనీలాయితాః = యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాః + తాః = ముక్తాస్తాః
తాః + శుభదాః = తాశ్శుభదాః
శుభదాః + భవన్తు = శుభదా భవన్తు
14 కామెంట్లు:
చాలా సార్లు చదవడమేగానీ అర్థము తెలియలేదు. తెలిపినందుకు ధన్యవాదాలు. నీకు సంస్కృతం వచ్చుగా దీని అర్థం ఏమిటి అని కూడా అడిగారు కొందరు నన్ను. గుడ్డిలో మెల్ల అని నవ్వుకున్నాను. ఇకనుండి ఆ భంగపాటు తప్పుతుంది.
బాబోయ్ విసర్గ సంధి. నిన్ననే అంతఃమర్గమా అంతర్మార్గమా అని సంశయం వచ్చి పాఠమాల తిరగవేసాను కానీ కనిపించలేదు. అంతర్మార్గమేనని అనుకుంటున్నాను.
అంతర్మార్గమే!
ఇది మీ రచనేనా? సరళ సుందరంగా ఉంది. లీలా శుకుల వారి శ్రీకృష్ణ కర్ణామృతం గుర్తొచ్చింది. "రాఘవ కర్ణామృతం" అనవచ్చును.
రాఘవార్య! శ్రీరామ వైవాహికః సతతం యుష్మాభిః శుభాని ప్రదీయన్తు.
రవిగారండోయ్... బాలో೭స్మి భోః సంస్కృతసారస్వతే. ఇదానీమేవ న శక్నోమి కర్తుమేతావత్కృతీః.
ఇంత అద్భుతమైన శ్లోకం నేను వ్రాసినదని ఎలా అనుకున్నారూ?!
ఇది ఆదిశఙ్కరాచార్యప్రణీతమని విన్నానండీ నేను. ఈ శ్లోకాన్ని పెళ్లి శుభలేఖలలో ముద్రించడం కద్దు. ఆ ముద్రించేదానిలో సగం మంది వారికి ఇచ్ఛగించినట్లు ముద్రిస్తుంటే చూడలేక, ఇలా ఆ శ్లోకానికి సంబంధించిన సాధుపాఠం ప్రచురించాను. దానితోపాటుగా అర్థతాత్పర్యాలూను. :)
మీరొక ముక్క ముందుగా చెప్పి ఉంటే బావుండేది. నా వ్యాఖ్యలో మొదటి లైను ఉపసంహరిస్తున్నాను. :-)
పెళ్ళిపత్రికలలో
"కల్యాణాద్భుత గాత్రాయ కామితార్థాయ ప్రదాయినే
శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళమ్ "
అనే శ్లోకం చాలా సార్లు చూశాను, మీరు చెప్పిన శ్లోకం గుర్తు లేదు.
మనలో మాట. నా పెళ్ళిపత్రిక గురించి నాకు అస్సలు గుర్తు లేదు. పెళ్ళి తర్వాత పెళ్ళికి, పెళ్ళానికి సంబంధించిన అన్నీ మర్చిపోవడం మామూలే. ఆ విషయం మీకూ తెలుస్తుంది.
ఔనండీ! ఈ శ్రీనివాసమంగలాశాసనశ్లోకాలు కూడా అచ్చువేస్తూంటారు.
కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే
శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళమ్
భలే ఉందండీ ఈ శ్లోకం. విన్న గుర్తు ఐతే ఉంది కానీ... ఎక్కడో మస్తిష్కపు లోపటి పొఱలలోనుండి వెలికితీసారు. నెనర్లు.
అన్నట్టు, వడుగు శుభలేఖలలో వ్రాసే శ్లోకం కూడా ప్రచురించాలి. భలే గుర్తొచ్చిందండీ, మీరు చెప్పిన శ్లోకం విన్నాక :)
"...కామితార్థ ప్రదాయినే" అని ఉండాలి ... నా ఉటంకింపులో దోషం సరిచేసినందుకు నెనర్లు.
"శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ
సీతాంగనా సుందర కోమలాంగీ
భూగర్భ జాతా భువనైక మాతా
వధూవరాభ్యాం వరదా భవంతు..
సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన"
అంటూ పెళ్ళిళ్ళలో మంగళ శ్లోకాలు మహాసంకల్పం అయిపోయాక ముహూర్తం వేళకి ఇంకా సమయం ఉంటే చదువుతూంటారు.. అప్పుడు కూడా ఈ జానక్యాః కమలామలాంజలి" శ్లోకం వినటం పరిపాటి.
సనత్ గారూ, నిజమేనండీ. సమయమింకా ఉందని నేను చూచిన ఒక పెళ్లిలో గణపతిమంత్రానికి ఘనపాఠం చదివాక, ఈ జానక్యాః శ్లోకానికే అనుకుంటాను ఘనపాఠం కూడా చదివారు. :)
తెలియకపోయినా, పుస్తకం పేరు చాలా దగ్గరగానే ఊహించారు రవి! ఈ పద్యాన్ని నేను శంకరాచార్య విరచిత "శ్రీరామ కర్ణామృతం"లో చదివాను. అయితే అందులో కూడా ఇలా విసర్గలు సంధి చేసి ఉన్న గుర్తు లేదు. విసర్గ సంధి సంస్కృతంలో నిత్యమా?
ఈ శ్రీరామ కర్ణామృతంలోనే భద్రాచల రాముని మీది "వామాంకస్థిత జానకీ పరిలసత్" అనే శ్లోకం కూడా ఉంది. ఇది నిజంగా శంకరాచార్యులవారే వ్రాసేరు అనుకుంటే, రామదాసు ముందు కాలంలో కూడా భద్రాద్రి రామయ్య బాగానే ప్రసిద్ధుడై ఉండాలి!
శ్రీరామ కర్ణామృతం Digital Libraryలో ఉంది.
చాలా సార్లు చదవడమేగానీ అర్థము తెలియలేదు. తెలిపినందుకు ధన్యవాదాలు. పైన ఉదహరించిన మూడు శ్లోకాలూ చాలాసార్లు చదివినవే పెళ్ళి శుభలేఖలలో . అర్ధం తెలియచేసినందుకు నెనర్లు. శ్రీరామ కర్ణామృతం నా దగ్గఱ లేదు. సంపాదించి చదవాలి.
సుముహూర్తే సావధాన పూర్తిగా పంపగలరు..
సుముహూర్తే సావధాన పూర్తిగా పంపగలరు..
ధన్యవాదాలు
మరి కొన్ని (విసర్గసన్ధికి) పదచ్ఛేదాలు
పద్మరాగాః + ఇతాః = పద్మరాగా + య్ + ఇతాః = పద్మరాగాయితాః
ప్రసూనాః + ఇతాః = ప్రసూనా + య్ + ఇతాః = ప్రసూనాయితాః
ఇన్ద్రనీలాః + ఇతాః = ఇన్ద్రనీలా + య్ + ఇతాః = ఇన్ద్రనీలాయితాః
కామెంట్‌ను పోస్ట్ చేయండి