మంగళవారం, సెప్టెంబర్ 11, 2007

కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగార్కి జయంతినివాళులు

ఊ.దుష్కరమైన ప్రాసలతొ దోచెను పండితమానసంబులన్
శుష్కిలుచున్న ఛందముకు శోభను దెచ్చెను ఆంధ్రసాహితీ
పుష్కరమందు నిల్చెగద పున్నమిచంద్రునిబోలురీతిలో
పుష్కల విశ్వనాథునికి పూలనివాళులు నాదు కైతలే.

11 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

నిజంగానా? చాలా సంతోషం. చెప్పినందుకు థాంకులు. మీరూ దుష్కర ప్రాసనే ఎంచుకుని సమర్ధవంతంగానే సాధించారు - అభినందనలు.

కొత్త పాళీ చెప్పారు...

దుష్కర ప్రాస అనగానే నాకు "ముష్కరులు" అన్నమాట తప్ప ఇంకోటి స్ఫురించదు :-)

రానారె చెప్పారు...

"ఛందమునకు" అంటాం మామూలుగా...
"ఛందముకు" కాస్త ఇబ్బందిగా ఉంది.
"ఛందసుకు" అని మారిస్తే 'ఉ'త్పలమాలలో
ఏదైనా దెబ్బతింటుందా రాఘవగారూ?

Naga Pochiraju చెప్పారు...

@kottapaaLi gaaru
ee sOmavaaram viSwanaatha vaari jayanti.vivaaraalaku aandhrabhoomi "saahiti" cooDagalaru

రాఘవ చెప్పారు...

ఈ పద్యం పుట్టడానికి ముఖ్యకారణం మళ్లీ మా లలితక్కయ్యే. లలితగారు చెప్పివుండకపోతే గనుక అసలు విస్వనాథ సత్యనారాయణగారి జయంతి సంగతి నాకు తెలిసేదే కాదు. లలితక్కా, కృతజ్ఞుణ్ణి.
@క్రొత్తపాళీ: ధన్యో೭స్మి.
@రామనాథ: మీరన్నట్లుగా "ఛందసు" అంటే వుత్పలమాలలో యేదీ దెబ్బతినదు. కాకపోతే, "ఛందస్" అనే సంస్కృతశబ్దంనుండి తెలుగులో "చందస్సు" అనే తత్సమం వుధ్భవించింది కాబట్టీ, చందస్సుని చందస్సుకోసమని చందసు అనటం నిజానికి అంత బాగోదేమోననిపించి చందము అని వాడాను తప్ప వేరే కారణమేమీ లేదు. :)

అజ్ఞాత చెప్పారు...

రాఘవ గారు,
పద్యం బావుంది. పాశ్చాత్య సంస్కృతి ని వ్యతిరేకించినాయనకు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న జయంతి చేయటం చిత్రం. మీరు "పుష్కల విశ్వనాధునికి" అన్నారు, ఓ 50, 70 ఏళ్లు గడిచిన తరువాత, అప్పటికి తెలుగు చదవటం వచ్చిన వాళ్లు ఉంటే, ఇది చదివి, పుష్కల ఇంటిపేరు, విశ్వనాధసత్యనారయణ వారి పేరు అనుకుంటారేమో :(.

అన్నట్టు మీరు గతం లో ఇచ్చిన రెండు సమస్యలకు పూరణలు ప్రయత్నించాను, పరిశీలించండి.

రాఘవ చెప్పారు...

నిజమేనండోయ్, ఆ ప్రమాదం లేకపోలేదు... ప్చ్

గిరి Giri చెప్పారు...

రాఘవ గారు,
దుష్కరమైన ప్రాస అన్నప్పుడు గణభంగం జరుగుతుందేమో? ఒక్కసారి చూడగలరు.

గిరి

రాఘవ చెప్పారు...

లేదండి, జరగదు.

గిరి Giri చెప్పారు...

మీరన్నది నిజమే. నేను వ్యాఖ్య రాసిన తర్వాత ఛందస్సుమీద మరికొంత జ్ఞానప్రాప్తి జరిగింది - దాని వల్ల తెలిసింది.

ఈ మధ్య కొత్త పద్యాలేవీ రాయడంలేదేమిటి?

రాఘవ చెప్పారు...

లేదండీ, తప్పకుండా వ్రాస్తాను. వ్రాసే ఘడియలు రావాలంతే :)