శనివారం, నవంబర్ 25, 2006

శ్రీ రామ్మోహన్ గారి 'ఆశీర్వాద' ప్రశంస

నేను ఇంటర్మీడియట్ లో వుండగా వ్రాసిన ఒకటీ రెండూ చిన్నా చితకా పద్యాలని మెచ్చుకొని శ్రీ రామ్మోహన్ గారు (శశి జూనియర్ కాలేజీ లో లెక్చరర్, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలు చెప్పేవారు) నాకు వ్రాసి యిచ్చిన పద్యమిది

కం. పద్యం నడకను మిక్కిలి
హృద్యంగా పట్టినావు యిట్టే బాగా
సద్యస్ఫూర్తికి నెలవే
విద్యార్థివి నీకు రాని విద్యలు కలవే.

8 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

పంతులుగారి అభినందనలు పొందడం - అందునా పద్య రూపంలో - అదృష్టం.. అభినందనలు. మీ పద్యాలు బాగున్నాయి.

రాఘవ చెప్పారు...

కం. చదివిన తదుపరి వెంటనె
వదలక పద్యముల పైన వ్రాయగ వ్యాఖ్యన్
చదువరి గారికి రాఘవ
పదములతో చెప్పు ధన్యవాదము లివియే.

మన్యవ చెప్పారు...

పద్యాలు ఎలా రాయాలో అన్న దానికి మీరు ఏమన్నా వ్యాసాలు రాసారా?

రాఘవ చెప్పారు...

ఇప్పటివరకూ అల్లాంటి టపా వేయలేదు. చూద్దాంలెండి. ఇంకెవరన్నా కూడా అడిగితే అప్పుడు వ్రాయొచ్చు :)

rākeśvara చెప్పారు...

నిజంగా బి.ఎ.రామ్మోహన రావుగారే...
నేను నా బ్లాగులో చాలా సార్లు మా తెలుగు మాస్టారు అని ప్రస్తావిస్తూవుంటాను. ఆయన ఈయనే.
నేను తొమ్మిదీ పదుల్లో ఆయన విద్యార్థిని.
ఈ సారి వూరువెళ్లినప్పుడు ఆయన్ని కలుద్దాం అనుకుంటుంటే తెలిసింది, ఆయన వేలివెన్ను నుండి రాజమండ్రి మారిపోయారని.
వారి పేరుతో మీ బ్లాగులో ఒక టపా చూడడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది.

rākeśvara చెప్పారు...

వృత్తాలు నేర్వడానికి వేసిన బొమ్మల టపాలో.. ఆఖరున గురువులు అని ఆయన్ని స్మరించడం కూడా జరిగింది
http://andam.blogspot.com/2007/07/blog-post_17.html

అజ్ఞాత చెప్పారు...

హైస్కూలు విద్యార్ధులకు పద్యప్రీతి కలిగించి, డిగ్రీలు తరువాత ఉద్యోగాలకు వచ్చినా కూడా, పద్యాలను, ఛందస్సును మర్చిపోకుండా పాఠాలు చెప్పటం సామాన్యం కాదు.

ఊహలు లేమియౌ శిశుల ఒజ్జయె పద్యసుధామహామహీ
వాహిని లందు తేనియలు పాలను మించుచవుల్‍గ్రహింపగా
దోహదమయ్యినిల్చె,తనుదోసిలినింపియెద్రాపెనేమొ,రా
మ్మోహనరావుగారికిటమోదము తోడనమస్కరించెదన్.


పద్య శ్రీసుధా ?

అజ్ఞాత చెప్పారు...

పద్య శ్రీసుధా ? తొలి ప్రతి లోనుంచి వచ్చింది - పట్టించుకోకండి.
ఊహలు లేమియౌ కన్నా ఊహలు సన్ననౌ అంటం ఉచితమేమో.