సోమవారం, మే 19, 2008

కళ్యాణరామ శతకం ౪

హరి! నీవు రాముడై వెలయఁ హరులై విహాయసచరులు
సురలందరు ఋషిగణములు క్షోణినిఁ సొచ్చిరి వన్య
చరసేనగా సేవఁ సేయఁ శరశూర! సమరలావణ్య!
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

6 కామెంట్‌లు:

గిరి Giri చెప్పారు...

మధ్యాక్కర నడకను చక్కగా పట్టుకున్నారు, పద్యాలు భలే జాలువారుతున్నాయి, ముఖ్యంగా ఈ పద్యం చదుకోవడానికి కూడా చాల ఇంపుగా ఉంది.

krishna చెప్పారు...

రాముణ్ణి చాలా చక్కగా వర్ణిస్తున్నారు.చాలా బాగుంటున్నాయి పద్యాలు.
శతకానికి ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.
రాముడే కథానాయకుడు కావున ఆయన కథే మరొకసారి చెప్పినా బాగుంటుందేమో

ఎక్కువ చనువు తీసుకున్నందుకు క్షంతవ్యురాలను.

అజ్ఞాత చెప్పారు...

గిరి గారితో ఏకీభవిస్తున్నాను. బాగున్నాయి పద్యాలు. అలాగే, కృష్ణుడు గారి ఆలోచనా బాగుంది.

రాఘవ చెప్పారు...

గిరి శ్రీనివాస్ గార్లకు
కృతజ్ఞతలు. సూచనలేమైనా ఉంటే నిర్మొహమాటంగా తెలియజేయమని ప్రార్థన.

కృష్ణుడు గారూ
రామకథలోని వేర్వేరు ఘట్టాలు చెప్పాలనే నా ప్రయత్నం కూడాను. లేకపోతే వంద పద్యాలు వ్రాయడం నాబోటి గాడికి అయ్యే పనేనా?

అజ్ఞాత చెప్పారు...

మీరు రాయగలరు రాఘవ గారు.

కాకపోతే, ఈ మకుటంతోటి వంద పద్యాలు రాయడం తలుచుకుంటేనే, అమ్మో అనిపిస్తోంది; పద్యాలన్నిటికీ ప్రాస ర యే ఉండాలి గదా, అందుకని.

రాఘవ చెప్పారు...

@చదువరి:
ఇంకా మూడే గదండీ పద్యాలు వ్రాసినది. చూద్దాం నేను వ్రాయగలనో లేనో. మీరన్నట్టుగా ఇది బృహత్కార్యమే.