మంగళవారం, మే 15, 2007

తెనాలి రామకృష్ణీయమ్

చం.స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో
అతులిత మధురీ మహిమ? ఆ తెలిసెన్, భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటన్ జుమీ.

3 కామెంట్‌లు:

rākeśvara చెప్పారు...

రాఘవ గారు,

చిన్నప్పుడెప్పుడో మా తలుగు మాస్టారు క్లాసులో ఈ పద్యం చెప్పి దాని తాత్పర్యం వివరించారు. ఇన్నాళ్ళ తరువాత దానిని చూసినందుకు సంతోషం. ఇన్నాళ్ళ తరువాత ఈ పద్యం చూసి దానిని గుర్తుపట్టగలిగినందుకు ఇంకా ఆనందంగా ఉంది.

కృతజ్ఞతలు

రాఘవ చెప్పారు...

మీ అభిప్రాయం "అర్థాలు కూడ కావాలి" అయితే అర్థాలు ఇవిగో:
అతులిత = అసమానమైన, ఉద్ధత సుకుమార = extremely youthful, వారవనిత = వేశ్యాస్త్రీ, జనతా ఘన తాప హారి = (వివిధ)జనుల గొప్ప తాపాన్ని ఉపశమింపజేసే, సంతత = నిరంతరం/ఎడతెగని, మధురాధరోదిత = మధుర+అధర+ఉదిత, ఉదిత = పుట్టిన, సుధ = అమృతము.

ఏదేమైనా ధన్యుణ్ణి.

rākeśvara చెప్పారు...

నాకు తాత్పర్యం గుర్తుంది.
Scandalous material బాగా గుర్తుంటుంది కదా కౌమారంలో ఉన్న కుర్రాళ్ళకి :)
మా గురువు గారు, వేశ్య పెదాలని, టీ హోటల్ లో నలుగురూ వాడే టీ కప్పులతో పోల్చారని కూడా గుర్తుంది.
రెండూ నలుగురూ అనుభవించేవి, రెండిటికీ extra taste ఉంటుందని చెప్పారు . :)