ఆదివారం, మే 13, 2007

నేనిచ్చే సమస్య 2

మలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్.

5 వ్యాఖ్యలు:

Raghava చెప్పారు...

ఏదో ఆలోచిస్తుంటే ఇది స్ఫురించింది. కొంచెం నాటుగా వున్నా నవ్వొచ్చేలా వున్నందుకు దీనిని ఇక్కడ వుంచాను.

swathi చెప్పారు...

నేను పద్యాలు రసేంత సాహసం చెయ్యట్లేదు కానీ పూరణ ఇలా ఉండొచ్చు అనిపిస్తుంది.

"కమలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్."

Raghava చెప్పారు...

లేదండీ, కమలము చంపకమాల గణాలకి సరిపోదు.

Raghava చెప్పారు...

ఇది నా పూరణ --

చం. సలలిత సుందరాననము చక్కని చూపులు మందహాసముల్
అలికురులున్ మనోహర కుమారికి అందమటంచు కుంద కు
ట్మలముల బోలినట్టి తన మానస చోరిణి లేకపోల యా
మలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్.

[సలలిత = lovely, అలికురులు = నల్లని శిరోజములు, కుందకుట్మలములు = మల్లె మొగ్గలు, లే కపోల యామలము = లేత బుగ్గలు]

radhika చెప్పారు...

మీ ఆలోచనను ఊహల్లో కూడా చేరుకోలేకపోయాను.నేను కూడా కమలము దగ్గరె ఆగిపోయా.