ఆదివారం, మే 13, 2007

నేనిచ్చే సమస్య 1

తన వొడిలో కుమారుఁ గని తల్లి భయంబున మూర్ఛనొందదా?

7 కామెంట్‌లు:

మన్యవ చెప్పారు...

... పూతన వొడిలో కుమారుఁ గని తల్లి భయంబున మూర్ఛనొందదా?

నాకు పద్యాలు రాయటం తెలియదు. కాని
"పూతన వొడిలో" అని కృష్ణుడి గురించి కాని "(మరణ) యాతన వొడిలో" అని రోగ బాధ పడుతున్న కొడుకి గురించి ఒక తల్లి పడుతున్న బాధ గురిచి కాని రాయచ్చేమో ఐడియా అయితే వచ్చింది అని. ఇది కరెక్టయితే చెప్పండి. అంతమాత్రం అయిడియా వచ్చినందుకు ఆనందిస్తా.

పద్యాలు రాయటం వచ్చిన వాళ్ళు ఏమని పూరిస్తారో వేచి చూస్తాను.

రాఘవ చెప్పారు...

శభాష్. నేను పూతన అనే పూరణను దృష్టిలో వుంచుకొనే ఇచ్చాను. నేనయితే ఈ విధంగా పూర్తిజేస్తాను:

చం.తనువు త్యజించినట్టి వొక టక్కరి రక్కసి పైన పుత్రునిన్
గనిన యశోద శోషిలెను కారణ మందుల కేమి యన్నచో
చనుగవ నిచ్చి పాలిడుచు చంపెడి యోచన జేసినట్టి పూ
తన వొడిలో కుమారుఁ గని తల్లి భయంబున మూర్ఛనొందదా?

అజ్ఞాత చెప్పారు...

నీకనిపించింది ఇతరులకు కూడా స్ఫురించడము, మరల నువ్వు దానిని అదే ఉద్దేశం వచ్చేట్టుగా పూరించడం ప్రశంసనీయం

అజ్ఞాత చెప్పారు...

పూరణకి కృష్ణుడి వృత్తాంతం నీకు స్ఫురించినట్టు మరొకరికి కూడా (అంటే ఇద్దరికి ఒకే ఆలోచన కలగటం) అనిపించడానికి అవకాశం చాలా తక్కువ. అది ఈ సందర్భంలో జరగటం ఆశ్చర్యపరిచే విషయం. మొత్తానికి ప్రక్రియ చాలా బాగుంది.

రాఘవ చెప్పారు...

ఆ.వె.ఆదిపూడివారి వ్యాఖ్యలందుకొనగ
సంతసించినాను సంబరమున
స్నేహితుడనుగనుక నీ పలుకులె నాకు
లక్షల విలువ గాద అహక రాజ!

Rama Deepthi Muddu చెప్పారు...

wow..first time here.. nice read...and trust me i was thinking of all the villain women and had a second thought about putana..
nice blog.. keep posting.. but can u plzz explain wat ur poems actually mean.. so that starters like me can understnad it even better..

రాఘవ చెప్పారు...

చం.తనువు త్యజించినట్టి వొక టక్కరి రక్కసి పైన పుత్రునిన్
గనిన యశోద శోషిలెను కారణ మందులకేమి యన్నచో
చనుగవ నిచ్చి పాలిడుచు చంపెడి యోచన జేసినట్టి పూ
తన వొడిలో కుమారుఁ గని తల్లి భయంబున మూర్ఛనొందదా?
అర్థాలు:
తనువు = శరీరం, త్యజించు = విడిచిపెట్టు, టక్కరి = మాయావి, రక్కసి = రాక్షసి (ప్రకృతివికృతులు), చనుగవ నిచ్చి పాలిడు = breast-feed, యోచన = ఆలోచన