బుధవారం, జులై 25, 2007

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్

చిలకమర్తివారి "ప్రసన్నయాదవం"నుండి --

చం.చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.
(నాకీ పద్యమిచ్చినది మా 'వాగ్దేవి' లలితక్క)

4 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

ఎంతో కాలంగా చికాకు పెడుతున్న ఈ పద్య పాదానికి ఒక మూలం చూపించి బతికించారు. గత ఐదేళ్ళలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళనే అడిగాను దీన్ని గురించి. శతకోటి ధన్యవాదాలు, మీకూ, మీ లలితక్క గారికీ.

రాఘవ చెప్పారు...

నా ధన్యవాదాలు కూడా లలితక్కకే :)

Naga Pochiraju చెప్పారు...

అక్కా అంటూ నన్ను పెద్దదాన్ని చెయ్యంకండీ
నేనింకా చిన్నదాన్నే,చితక దాన్నే :)
కావాలంటే మా బామ్మ ను అడగండీ..."అబ్బే..ఇంకా 5వ ఏడే పూర్తిగా నిండ లేదు..2ఏళ్ళా క్రితమేగా 5 పడ్డది " అంటుంది

datthu చెప్పారు...

ధన్యవాదాలు మీకు