కం.మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !
[జానపదులు = గ్రామవాసులు, నటత్ = గెంతే, భేకము = కప్ప, ధుని = నది, శీకరము = నీటిబిందువు, చెమ్మ = తడి]
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !
[జానపదులు = గ్రామవాసులు, నటత్ = గెంతే, భేకము = కప్ప, ధుని = నది, శీకరము = నీటిబిందువు, చెమ్మ = తడి]
4 కామెంట్లు:
రాయల సమక్షంలో రామకృష్ణుడు ఈ పద్యం చెప్పగానే రాయలు "గగన ధుని నాక ధుని ఐతే?" అంటాడు. "ఇంకా రసవత్తరంగా ఉంటుంది ప్రభూ!" అని పరవశించి తన తలపాగాని రాయలికి బహుమతిస్తాడు రామకృష్ణుడు - కనీసం సినిమాలో జరిగే సన్నివేశం ఇది.
ఇంతకీ గగన ధుని నాక ధుని ఐతే ఎందుకు అంత రసవత్తరమైనట్టు?
దిగువనీయబడినది నేనూహించే కారణం. కానీ, యీ 'గగనధుని', 'నాకధుని' విషయంలో లోతుపాతులు యే ఆంధ్రసాహిత్యాధ్యాపకుల్నో అడగాలేమో!
భర్తృహరి చెప్పిన "శిరః శర్వాత్ స్వర్గాత్" లేదా దానికి ఏనుగు లక్ష్మణకవి ఆంధ్రానువాదమైన "ఆకాశంబుననుండి శంభునిశిరం బందుండి శీతాద్రి" పద్యం నుండి, సురనదియైన గంగను సురగంగ, ఆకాశగంగ, భూతలగంగ(?)... అని వివిధ రకములుగా విభజించగలిగే వెసులుబాటు వుందని నేను వూహించి చేసిన చిన్న ప్రయత్నం.
"నూతిలోనుండి బయటకు కూడా గెంతలేని కప్పకి ఆకాశగంగయొక్క తడి యే విధంగా అంటదో" అని రామకృష్ణుడంటే, "అయ్యో, ముక్కు తిమ్మన యింకా గొప్పవాడయ్యా" అని శ్రీకృష్ణదేవరాయలు దాన్ని "ఆకాశగంగనైతే అందుకోగలదేమో అదే సురగంగ అయితే యెంత గెంతినా ప్రయోజనం వుండదు... దాన్ని అందలేదు" అన్న భావనతో సవరించి యుండవచ్చు. ఆకాశగంగనంటడమెలా అంటే 'ఆకాశవీధిలో హాయిగా తిరిగే' మేఘాలు ఆ ఆకాశగంగను తాకితే, యీ కప్ప అదృష్టం బాగుండి ఆ మేఘాలు వాన చినుకులుగా ఆ నూతిపై/లో పడితే కప్ప ఒకరకంగా ఆకాశగంగనంటినట్లే!!!
అసలు కారణం నాకు తట్టట్లేదు... తెలిసినవారు తెలుప మనవి.
krishan murali
(braahmii@gmail.com)
padyam loo "ka" kaaram ekkuva saarlu vastumdi. amdukee gagana dhuni kannaa naaka dhuni ayitee maroo ka kaaraam perigi sraavyata marimta perugutumdani chadivaanu.
మీరు చెప్పినది బహుబాగున్నది! :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి