బుధవారం, అక్టోబర్ 31, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - లలితాంబిక

శా.నాడో గతజన్మలందొ కలనో నీ నామముం వింటినే
మో నా పూర్వుల లబ్ధపుణ్యఫలమో నోరారకీర్తించగా
నీ నా మానుషజన్మమెత్తితినొ అన్నీ నీదుసంకల్పమో
కానన్ కారణమేదియైన "లలితా" కాపాడు శ్రీమాతృకా.

2 వ్యాఖ్యలు:

Giri చెప్పారు...

అయ్యా, అచ్చులు అ, ఈ, ఊ, ఏ, ఓ, ఋ, ఐ, ఔ, అం లు వచ్చేవిధంగా వ్రాస్తున్నారని బోధపడింది. అద్భుతం..చాలా బావుంది..

Raghava చెప్పారు...

హమ్మయ్య! బ్రతికించారు. వ్రాయటంలేదన్నారని మొదలుపెట్టిన పద్యాన్ని పూర్తిజేసేశాను. :)