ఉ.మిక్కిలి యందమైనదియు మేటియు భారతభాషలన్నిటా
పెక్కుధరాధిపాదులకు పిన్నలపెద్దలయందరిన్ మహా
మక్కువయైనభాష మనమాతృకయై వెలుగొందునట్టిదౌ
చక్కని ఆంధ్రమాతకివె జన్మదినోత్సవ మోదశంసనల్
[అక్క యభీష్టముం దెలిసి తమ్ముడు వ్రాసిన పద్యమిద్దియే].
Thursday, November 01, 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)

10 అభిప్రాయములు:
..చక్కగ చెప్పినావు కడు చక్కటి పద్యములోన రాఘవా!
అద్భుతమైన పద్యం వ్రాశారు ఆంధ్ర దినోత్సవమహోత్సవానికి
నిక్కము, యేదియోవొకటి నీవలెగాద తెనుంగుభాషకున్
ఠక్కున పద్యమేకలిగె డస్సిననాల్కకు తీపితేనెలా.
బావుంది,ఇంకొక ఉత్పలమాల తయారయ్యింది..
"ఠక్కున పద్యమేకలిగె డస్సిననాల్కకు తీపితేనెలా"
కన్నా యీ క్రిందిది బాగుంటుందేమో --
"ఠక్కున పద్యమే కలిగె డస్సిన జిహ్వకు తేనె ధారలా"
http;//nijamga-nijam.blogspot.com
నా తమ్మునివై,పద్యములు రాయుటలో అందరికీ అన్నయై ,మన సాహీతీ వారసత్వం నిలుపుటలో పెద్దవై వర్ధిల్లు .......
బాగుంది .. టపా ఒక ఉత్పలమాల .. వ్యాఖ్యలూ ఉత్పలమాల పాదాలు .. శెబాష్. అల్లసాని పెద్దన గెండపెండెరం గెలవటానికి పదహారో ముప్ఫైరెండో పాదాలతో ఉత్పలమాల (సగం తెలుగులో సగం ఇంగ్లీషులో) చెప్పినట్టు .. ప్రొసీడైపోండి.
..పొరబాటు .. పెద్దన చెప్పింది ఇంగ్లీషులో కాదు - సగం తెలుగులో సగం సంస్కృతంలో :-)
అన్నట్టు రాఘవ, మరియు ఇతర పద్య ఔత్సాహికులు - గిరి బ్లాగులో నేనిప్పుడే రాసిన ఈ వ్యాఖ్య చదవండి దయచేసి.
పెద్దలదీవెనలకు కృతజ్ఞతాదరప్రణామాలు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి