Wednesday, October 24, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - సరస్వతి

చం. షిగణపణ్డితామరనిషేవిత బుద్ధిప్రదాత్రివీవు క
ల్మషరహితేన్దుబింబసమవక్త్రవు ముక్తికినడ్డుగోడలౌ
విషయవిషంబులన్ విరచు భేషజమీవని నమ్మినాడనో
ఝషనయనా నమస్సులివె జాడ్యముసేయక బ్రోవు "భారతీ".

2 అభిప్రాయములు:

కొత్త పాళీ చెప్పారు...

బాగుంది రాఘవా, శరన్నవరాత్రులలో అమ్మవారి స్తుతి.
ఝషనయనా అన్న సంబోధన చూసి ఒక పాత కథ గుర్తొస్తోంది. అప్పుడెప్పుడో ఒక స్నేహితుడు తన చిన్నారి కూతురికి తెలుగు నేర్పించాలని తెలుగు అ ఆ ల పుస్తకం ఇండియా నించి తెచ్చి పాఠం చెబుతున్నాడు. జ ఝ దగ్గిరికి వచ్చేప్పటికి ఒక చేప బొమ్మ వేసి ఝషము అని రాసి ఉంది. చేపని ఝషము అంటారని వాడికీ తెలీదు నాకూ తెలీదు. మర్నాడు హోటల్లో భోజనానికి వెళ్ళినప్పుడు పాపకి తినిపిస్తూ "ఝషము తినమ్మా" అని వాడు పాపని బుజ్జగించటం తల్చుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. అప్పటికి ఇప్పటికి ఇదే మళ్ళీ ఝష దర్శనం :-)

Raghava చెప్పారు...

:)