బుధవారం, అక్టోబర్ 24, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - కాళి

ఉ.క్షణమాత్రమైనపడనివ్వదు సాధనజేయుబిడ్డపై
మోక్షపుమార్గమెంచి పరమోన్నతలక్ష్యమువైపుసాగుచూ
దీక్షనుబూని కాళికను దీవెనలిమ్మని వేడుకున్నచో
రాక్షసమాయ మాయమగు రక్షణనిచ్చును "కాళి" తల్లియై.

2 కామెంట్‌లు:

గిరి Giri చెప్పారు...

చివరి పాదంలో 'బాల', 'కాళి', 'భారతి' ఇలా దేవి నామాలని ఉంచుతూ చాలా బాగా రాస్తున్నారు. అమ్మ మీద ఇంకా ఆరు పద్యాలు రాస్తారా?

రాఘవ చెప్పారు...

ధన్యో2స్మి. వ్రాయాలనే సంకల్పం. సమయాభావంవల్ల నవరాత్రులలో అన్నీ వ్రాయటం కుదరలేదు. కొన్ని మొదలుపెట్టి వదిలివేశాను. ఎప్పుడో వీలుచూసుకుని పూర్తిజేయాలి.