మాయ కూడా అమ్మవారి రూపమే, కానీ (విచిత్రంగా) ఆ మహామాయ కమ్మటం చేత మన స్వస్వరూపాలను తెలుకోలేకపోతున్నాం. దీన్ని నొక్కివక్కాణిద్దామని మాయని వాలుగా వ్రాసాను. అంబుధిజాత అన్నా అంబుజజాత అన్నా శ్రీమహాలక్ష్మినే. అందువల్ల జని కుండలీకరణాలలో వుంచాను. ఇక అమ్మను బాలాత్రిపురసుందరిగా పూజిస్తున్నానని తెలియజేయటానికి బాలకు "" తగిలించాల్సి వచ్చింది. మీరు అడగనిది మరొకటి వుండిపోయింది :) కనుక్కోండి చూద్దాం. అవునండోయ్, అన్నట్లు నేను వ్రాసినది అంత క్లిస్టంగా వుందా అర్థంచేసుకోవటానికి? సులభంగా వ్రాద్దామనే నా ప్రయత్నం కూడాను.
రాఘవగారు, మీకు చెప్పేపాటి వాడను కాదు కానీయండి- అద్రికుమారి కంటే అద్రిసుపుత్రి అంటే బాగుంటుందేమో విశ్వమునంతట మాతృమూర్తివై కన్నా విశ్వమునంతయు మాతృమూర్తివై బాగుంటుందనిపించింది. లలితా స్రవంతి గారు చెప్పినట్లు నవరాత్రాలూ రాయండి, మీకు మాకూ కూడా అమ్మ ఆశీర్వాదం ఉంటుంది.
రాఘవగారు, ఒక అసందర్భ వ్యాఖ్య, తొలిచేస్తున్న ఓ అనుమానం రావడం వల్ల రాయవలసి వచ్చింది..నేను రాసిన ఈ ఉత్పలమాలలో, మూడవ పాదంలో యతిమైత్రి ఉన్నట్లేనా? లేక అచ్చులు మైత్రి పాటించలేదు కాబట్టి తప్పా? వివరించగలరు..
వూకదంపుడు వరేణ్యా, మీరు "మీకు చెప్పే సాటివాడను కాను" అంటూ నన్ను మరీ యెత్తెయ్యకండి, పడ్డానంటే యింకా రావల్సిన నాల్గుపళ్లతో కలిపి మొత్థం ముప్ఫైరెండూ వూడిపోతాయి [:D] పద్యాన్ని నాకు తోచినట్టు నేను వ్రాశాను. అక్కడక్కడా కొన్ని పదాలు సరిగా పడి వుండకపోవచ్చు. యెంత మా యింటిపేరు 'ముక్కు' అయితే మాత్రం నేను తిమ్మనామాత్యుణ్ణైపోతానా చెప్పండి... కాబట్టి నిస్సందేహంగా మీకు యెలా సౌకర్యంగా అనిపిస్తే అలానే చదువుకోండి.
వికటకవీశ్వరా, యేదో సరదాగా వ్రాసే నాబోటివాళ్ల పద్యాలు కూడా చదివి మెచ్చుకున్నారంటే మీదెంత గొప్పమనసో అర్థమౌతోంది. ఏదేమైనా కృతజ్ఞుణ్ణి.
9 కామెంట్లు:
మాయ వాలుగా, బాల కోట్స్ లో, జ ని బ్రాకెట్స్ లో ఎందుకు పెట్టారో వివరించ గలరు.
మీరు వాడుతున్నట్టి పదాలు వల్ల శబ్దరత్నాకరం (దగ్గర లేదు కానీ,ఉంటే మత్రం)తెగ తిరగెయ్యాలి.
మాయ కూడా అమ్మవారి రూపమే, కానీ (విచిత్రంగా) ఆ మహామాయ కమ్మటం చేత మన స్వస్వరూపాలను తెలుకోలేకపోతున్నాం. దీన్ని నొక్కివక్కాణిద్దామని మాయని వాలుగా వ్రాసాను. అంబుధిజాత అన్నా అంబుజజాత అన్నా శ్రీమహాలక్ష్మినే. అందువల్ల జని కుండలీకరణాలలో వుంచాను. ఇక అమ్మను బాలాత్రిపురసుందరిగా పూజిస్తున్నానని తెలియజేయటానికి బాలకు "" తగిలించాల్సి వచ్చింది. మీరు అడగనిది మరొకటి వుండిపోయింది :) కనుక్కోండి చూద్దాం.
అవునండోయ్, అన్నట్లు నేను వ్రాసినది అంత క్లిస్టంగా వుందా అర్థంచేసుకోవటానికి? సులభంగా వ్రాద్దామనే నా ప్రయత్నం కూడాను.
పద్యం బాగుంది
నవ రాత్రుల్లో ప్రతి రోజూ ఒక్కో పద్యం అమ్మవారి మీద రాయి
అమ్మ ఆశీర్వాదం ఉంటుంది.
లేదు అంత కష్టంగా లేదు - నాకు తాత్పర్యం అర్ధం అయ్యింది, కాని ప్రతిపదార్థం వద్దనే దెబ్బ తిన్నా, అందుకని అలా అన్నా..ఉ. విద్రుమ, అంబుధిజజాత..
నేను అడగనిది అద్రిలో 'అ' బోల్డు వత్తుగా ఎందుకు రాసారనా?
రాఘవగారు,
మీకు చెప్పేపాటి వాడను కాదు కానీయండి-
అద్రికుమారి కంటే అద్రిసుపుత్రి అంటే బాగుంటుందేమో
విశ్వమునంతట మాతృమూర్తివై కన్నా విశ్వమునంతయు మాతృమూర్తివై బాగుంటుందనిపించింది.
లలితా స్రవంతి గారు చెప్పినట్లు నవరాత్రాలూ రాయండి, మీకు మాకూ కూడా అమ్మ ఆశీర్వాదం ఉంటుంది.
రాఘవగారు,
ఒక అసందర్భ వ్యాఖ్య, తొలిచేస్తున్న ఓ అనుమానం రావడం వల్ల రాయవలసి వచ్చింది..నేను రాసిన ఈ ఉత్పలమాలలో, మూడవ పాదంలో యతిమైత్రి ఉన్నట్లేనా? లేక అచ్చులు మైత్రి పాటించలేదు కాబట్టి తప్పా? వివరించగలరు..
ఇదే మొదలు మీ బ్లాగుకి రావటం. చాలా బాగున్నాయి మీ పద్య రత్నాలు.
వూకదంపుడు వరేణ్యా, మీరు "మీకు చెప్పే సాటివాడను కాను" అంటూ నన్ను మరీ యెత్తెయ్యకండి, పడ్డానంటే యింకా రావల్సిన నాల్గుపళ్లతో కలిపి మొత్థం ముప్ఫైరెండూ వూడిపోతాయి [:D]
పద్యాన్ని నాకు తోచినట్టు నేను వ్రాశాను. అక్కడక్కడా కొన్ని పదాలు సరిగా పడి వుండకపోవచ్చు. యెంత మా యింటిపేరు 'ముక్కు' అయితే మాత్రం నేను తిమ్మనామాత్యుణ్ణైపోతానా చెప్పండి... కాబట్టి నిస్సందేహంగా మీకు యెలా సౌకర్యంగా అనిపిస్తే అలానే చదువుకోండి.
వికటకవీశ్వరా, యేదో సరదాగా వ్రాసే నాబోటివాళ్ల పద్యాలు కూడా చదివి మెచ్చుకున్నారంటే మీదెంత గొప్పమనసో అర్థమౌతోంది. ఏదేమైనా కృతజ్ఞుణ్ణి.
ఊ.దం.గారూ, నిజమే, అద్రిసుపుత్రి అంటే వున్న శబ్దసౌష్ఠవం (వృత్యనుప్రాసలాంటి అలంకారవిశేషం) అద్రికుమారి అంటే లేదు. చక్కటి సలహా యిచ్చారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి