గురువారం, ఏప్రిల్ 30, 2009

భర్తృహరి వైరాగ్యశతకము ౧

ఎందుకో తెలియదు కాని భర్తృహరి వ్రాసిన వైరాగ్యశతకం చదవాలి అనిపించింది. స్థాళీపులాకన్యాయంగా అక్కడక్కడా ఒకటీ రెండూ చదివితేనే అద్భుతంగా తోచింది ఈ శతకం. అలా చదివాక (భర్తృహరి ఎలాంటి స్థితిలో ఏ ముహూర్తాన ఏ ఉద్దేశ్యంతో వ్రాయటం మొదలుపెట్టారో కానీ) వైరాగ్యశతకంలోని ఒక్కో శ్లోకానికీ వైరాగ్యపు రుచి తెలియజేసే లక్షణం పుష్కలంగా ఉందీ అని అనిపించింది. ఎలాగూ చదవటం ప్రారంభించబోతున్నాను కదా, ఒక్కో శ్లోకం చదివినప్పుడు నాకు ఏయే ఆలోచనలు కలిగాయో అవన్నీ వ్రాసి పెట్టుకుందాం అని తోచి, ఇలా...


చూడోత్తంసితచారుచన్ద్రకలికాచఞ్చచ్ఛిఖాభాస్వరో
లీలాదగ్ధవిలోలకామశలభః శ్రేయోదశాగ్రే స్ఫురన్।
అన్తఃస్ఫూర్జదపారమోహతిమిరప్రాగ్భారముచ్చాటయం
శ్చేతః సద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః॥ ౧


చూడా శిఖాయాం। ఉత్తంసిత భూషణీకృతస్య। చారు మనోజ్ఞమూర్తేః। చన్ద్ర శశేః। కలికా కలాయాః। చఞ్చత్ ప్రకాశమానేన। శిఖయా అగ్రేణ। భాస్వరః ప్రకాశమానః॥ లీలా విలాసేన। దగ్ధ భస్మీకృత। విలోల చఞ్చల। కామశలభః మన్మథ నామ శలభః॥ శ్రేయః శుభానాం। దశా అవస్థాసు। అగ్రే పురతః। స్ఫురన్ ప్రకాశయన్॥ అన్తః మనసి। స్ఫూర్జత్ (తడిదివ) జృంభమాణస్య। అపార మహత్। మోహ తిమిర మోహాన్ధకారస్య। ప్రాక్ పురతః స్థితమ్। భారమ్ మహాన్తమజ్ఞానమ్। ఉచ్చాటయన్ నాశయన్॥ చేతః మనః। సద్మని గృహే। యోగినాం భక్త్యాది యోగేషు స్థితానాం। విజయతే వర్తతే॥ జ్ఞాన ప్రదీపః జ్ఞాన ప్రకాశకః॥ హరః భవానాం దుఃఖానాం అజ్ఞానానాం నాశకః॥

అత్ర హరో జ్ఞానప్రదీపః। భక్తానాం (చన్ద్రకలికాప్రయోగేణ ప్రతిక్షణవర్ధమానం తాపహారిత్వం జ్ఞాయతే) శీతకరవత్తాపహారీ కామాదీనాం శలభానాం సంహారకశ్చ। ఏషః హరః కుత్ర వర్తతే। చేతస్సద్మని। కేషాం। తృష్ణాద్వేషిణాం యోగినామ్। కథమ్। శ్రేయోదశాగ్రే స్ఫురన్। అన్తస్ఫూర్జదపారమోహతిమిరప్రాగ్భారముచ్చాటయన్॥ యది మనః హరావాసం కర్తుమిచ్ఛసి తర్హి యోగీ భవేత్యన్వర్థః॥

తా. హరుడు జ్ఞానమనే వెలుగునిచ్చే దీపం. సిగలో అలంకరించుకున్న చంద్రకళ యొక్క వెలిగే కొనచే ప్రకాశిస్తూన్నవాడు, కాముడనే మిడుతని మసిచేసినవాదు ఐన ఆ శివుడు శ్రేయస్సునిచ్చే వివిధ దశలలో ముందుగా పొడజూపుతూ మనస్సులోని గొప్ప మోహపుటజ్ఞానాన్ని నాశనం చేస్తూ యోగుల హృదయపంజరంలో శోభిల్లుతున్నాడు.

ఏనుఁగు లక్ష్మణకవి తెలుఁగు:
కలితవతంసితేన్దుకలికాశిఖిచే విలసిల్లి చిత్తభూ
శలభము నుగ్గు సేసి శుభసారదశాగ్రమునన్ వెలుంగుచున్।
బలవదపారమోహభరబాఢతమోహరణంబు సేయుచుం
దెలివి వెలుంగు పొల్చు శివదేవుఁడు యోగిమనోగృహంబులన్॥

6 కామెంట్‌లు:

pachi telugodu చెప్పారు...

తాత్పర్యం చెబితే బాగుండేది

రాఘవ చెప్పారు...

ఇప్పుడు తెలుగులో తాత్పర్యం జతచేసాను, చూడండి.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

బాగుందండి. సాధారణంగా సంస్కృతానికి తెలుగులో అర్థము చెపుతుంటారు. మీరు సంస్కృతానికి సంస్కృతములోనే అర్థము చెప్పారు. బాగుంది. మాలాంటివారికి మరి కొన్ని పర్యాయ పదాలు తెలుస్తాయి.

Unknown చెప్పారు...

దయతో ఏనుగు లక్ష్మణకవి గారి తెలుగు అనువాద పద్యం కూడా జత చేస్తే మా బోటి తెలుగు పిచ్చోళ్ళకు మరింత ఆనందం కలిగించినవారవుతారు.

Bolloju Baba చెప్పారు...

my comment is also diTTo to sri narasimhagaaru

రాఘవ చెప్పారు...

లక్ష్మణకవి తెలుగుపద్యం కూడా జత చేసాను, చూడండి.