శనివారం, మే 02, 2009

భర్తృహరి వైరాగ్యశతకము ౨

భ్రాన్తం దేశమనేకదుర్గవిషమం ప్రాప్తం న కిఞ్చిత్ఫలం
త్యక్త్వా జాతికులాభిమానముచితం సేవా కృతా నిష్ఫలా।
భుక్తం మానవివర్జితం పరగృహేష్వాశఙ్కయా కాకవత్
తృష్ణే జృమ్భసి పాపకర్మనిరతే నాద్యాపి సంతుష్యసి॥ ౨


భ్రాన్తమ్ పర్యాటితమ్। దేశమ్। అనేకదుర్గవిషమమ్ బహుభిః గన్తుం దుర్గమైః స్థానైః వికటమ్। ప్రాప్తమ్ లబ్ధమ్। న కిఞ్చిత్ న స్వల్పమపి। ఫలమ్ సంతోషధనాదిరూపం ఫలితమ్॥ త్యక్త్వా విసృజ్య। జాతికులాభిమానమ్ బ్రాహ్మణాదిజాత్యభిమానం వంశాదికులాభిమానం చ। ఉచితమ్ హితమ్। సేవా పరిచర్యా। కృతా ఆచరితా। నిష్ఫలా యస్యాః ఫలం నాస్తి సా॥ భుక్తమ్ ప్రాశితమ్। మానవివర్జితమ్ మానేన అభిమానేన విశేషతః వర్జితమ్। పరగృహేషు పరాణాం గేహేషు। ఆశఙ్కయా భీతినా వా సందేహేన। కాకవత్ కాకేవ॥ తృష్ణే విషయేషు ఆసక్తిః। జృమ్భసి వృద్ధిం యాసి॥ పాపకర్మనిరతే పాపిష్ఠే। న అద్య అపి ఇదానీమపి। సంతుష్యసి సంతుష్టా న భవసి॥

వైరాగ్యార్థం తృష్ణాదూషణమత్ర ద్రక్ష్యతే। కైషా తృష్ణా। యయా తృష్ణయా ఫలాపేక్షయా కృతమ్ దుర్గమం దేశపర్యటనం ఫలరహితం బభూవ। యయా తృష్ణయా జాతికులాభిమానత్యాగేన కృతా యత్సేవా నిష్ఫలా బభూవ। యయా తృష్ణయా చోదితః మానరహితేషు పరగృహేష్వపి కాకవత్ ఆశఙ్కయా భుక్తం చ। యా పాపిష్ఠా। యేదానీమపి జృమ్భతి న తుష్యతి। తాం ప్రతి దూషణమ్॥

తా. దుస్సంచారములైన ప్రదేశాలలో దేశాటన చేసాను కానీ ఫలితం శూన్యం. జాత్యభిమానం కులాభిమానం వదిలి నిరుపయోగంగా (ధనికులు మొదలైనవారికి) సేవ చేసాను. (ఆపదలో) బెదురుతూనే ఇతరుల ఇళ్ళలో గౌరవంలేకున్నా కాకిలా భోజనం చేసాను. ఇన్ని కష్టాలు పడినా ఓ పాపిష్ఠపు తృష్ణా, ఇప్పటికీ తృప్తి కలగడం లేదు. నీవు ఇంకా ఇంకా పెరుగుతూనే విజృంభిస్తూనే ఉన్నావు.

విసికితి దుర్గదుర్విషయవిభ్రమయుక్తిఁ గులాభిమానమున్
బసచెడ సేవ చేసితి విపన్నుఁడనై పరగేహసీమ వా।
యసము వలెన్ భుజించితిఁ బ్రయత్నము నిష్ఫలమై నశించె సం
తసపడ వుగ్రకర్మపిశునత్వము చూపెద వాశ యేటికిన్॥

2 వ్యాఖ్యలు:

కౌటిల్య చెప్పారు...

రాఘవ గారూ..సుభాషితాలకి,టీక ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా...ఇంకో మాట..ఈ వయసులో ఇంత సాహిత్య జ్ఞానం,సంస్కృత విజ్ఞానం ఎలా సంపాదించారండీ...

రాఘవ చెప్పారు...

కౌటిల్యగారూ

భర్తృహరి సుభాషితాలూ దానికి టీకా తెలుగు పద్యమూ అన్నీ కలిగిన ప్రచురణ వావిళ్లవారిది ఉందండీ. అలాగే జ్యోతిష్మతీ ముద్రణాలయం (వావిళ్లవారిలాగానే ఈ ముద్రణాలయం కూడా ఎప్పటిదోనండీ) వారిది కూడా ప్రతి ఉండాలని విన్నాను. శ్రీరామకృష్ణమఠంవారు వైరాగ్యశతకాన్ని మాత్రం ఆంగ్లానువాదంతో ప్రచురించారు. ఆంధ్రభారతి జాలపుటలలో మూలమాత్రం లభ్యమౌతుంది.

సాహిత్యభాషాజ్ఞానాలు నాకు శూన్యమాత్రంగా ఉన్నాయన్నది వాస్తవం.

నమస్సులతో
భవదీయుడు