శనివారం, జనవరి 12, 2008

తాంబూలం!!!

కం.ఎప్పుడు యెక్కడ పడితే
అప్పుడు అక్కడ కవిత్వ మబ్బాలంటే
తప్పక నోట నమలవలె
కప్పుర తాంబూలమంచు గాఠిగ చెప్తే

కం.చెప్పుచు చక్కని కవితలు
మెప్పింతురొ లేదొ గాని వెధవది దీన్లో
ముప్పేంటంటే అందుకు
అప్పుల పాలౌదురేమొ మన కవులంతా! :P

10 కామెంట్‌లు:

9thhouse.org చెప్పారు...

సిరి అబ్బకపోయినా చీడ అబ్బడం అంటే అదే.... చాలా బాగున్నాయి కందాలు.

rākeśvara చెప్పారు...

ఒక సారి రామ్మోహన రావుగారు పెద్దన గారి పద్యం చెప్పి క్లాసులో, "అవన్నీ వుంటే కవిత్వం వస్తుందోలేదో గానీ నిద్ర వస్తుంది, అదీ మేము (అభ్యుదయ కవులు) పొట్ట మండితేనే గానీ కవితలు వ్రాయలేము" అన్నట్టు గుర్తు.
:)

అజ్ఞాత చెప్పారు...

entoo ikkada andaruu kavitalni namili nemarestunna vaare kanapadutunnaru :(

chakradhar
www.chakradhar.net

అజ్ఞాత చెప్పారు...

వేప్పుల్లనువాడుటజే
అప్పటి కాలమునజెల్లె; ఆవిధి విడెమున్
ఇప్పుడు నమిలిన, చెప్పక
తప్పదు, పళ్ళూడి నోట దవడలె మిగులున్

రాఘవ చెప్పారు...

మురళిగారూ, ధన్యో2స్మి.

రాకేశ్వరా, యిల్లాంటి విశేషాలెన్నో చెప్పేవారు శ్రీ రామ్మోహన్ గారు. నేనూ ఆయన శిష్యుణ్ణేగానీ ఆయనవద్ద యేమీ చదువుకోలేదు. ప్చ్... ప్రాప్తం వుండాలి కదా దేనికైనా. ప్రత్యక్షశిష్యుణ్ణి కాకపోయినా కనీసం పరోక్షశిష్యుణ్ణైనా అవ్వగలిగానని అదో సంతృప్తి. ఇప్పుడు మీరు ఆయనని మళ్లీ గుర్తుజేసారు. కృతజ్ఞుణ్ణి.

హే చక్రిన్, మీరు కూడా నమిలి నెమరువేసి వంటపట్టించుకోండి మరి :)

ఊకదంపుడు వరేణ్యా, యిది చాలదూ (అంటే యీ పద్యపరంపర సరిపోతుంది కదా... అని) పెద్దనగారు చెప్పినవి యీ కాలంలో సరిపోవూ అని నిరూపించటానికి? హాస్యాన్ని చక్కగా పండించడంలో మీరు దిట్ట అని మళ్లీ నిరూపించుకున్నారుగా :)

అజ్ఞాత చెప్పారు...

రాఘవ గారు ,ధన్యోస్మి.

అజ్ఞాత చెప్పారు...

tamalamu vEsina ammaayi palukullaaga kandaalu andangaa vunnaayi.

అజ్ఞాత చెప్పారు...

తమలము వేసిన అమ్మాయి పలుకుల్లాగ కందాలు అందంగా వున్నాయి.

రాఘవ చెప్పారు...

కృష్ణుడుగారూ యేదో మీ అభిమానం, ధన్యుణ్ణి :)

Murali చెప్పారు...

బావున్నాయి కందాలు. ఊకదంపుడు గారి వ్యాఖ్య సముచితంగా ఉంది.