కం. మరి మరి అడిగెద నాకిల
వరములు యితరములు వలదు వారిజనయనా
నిరతముగ మదిని నీ శ్రీ
చరణకమలభక్తి నాకు చాలును రామా.
श्लो॥ वरं न याचे रघुनाथ युष्मत्पादाब्जभक्तिस्सततं ममास्तु।
इदं प्रियं नाथ वरं प्रयच्छ पुनःपुनस्त्वामिदमेव याचे॥
Friday, January 05, 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
3 అభిప్రాయములు:
మనసును మురిపించు మంచి ముత్యాల కొరకు
మరి మరి వచ్చెద ఈ బ్లాగునకు
తదుపరి అద్భుత పద్యముల కొరకు
మరి మరి చదివి ఆనందించుట కొరకు
కం.ప్రోత్సాహపు పలుకులతో
ఉత్సుకతను పెంచినారు - ఉల్లాసముతో
తాత్సారము జేయక యీ
వత్సరములొ పూర్తి జేస్తు పదిలముగ కృతిన్.
అమృతమంతటి సాహిత్యముంటే
ఆనందించెడి అతిథులు ఉంటే
ఆలస్యము చేయనని మీరంటే
అంతా వుంటాం మీవెంటే
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి