మంగళవారం, ఏప్రిల్ 25, 2006

చాటువులు ౧

ఉ.మామను సంహరించి యొక మామకు గర్వమడంచి యన్నిశా
మామను రాజుజేసి యొక మామ తనూజున కాత్మబంధువై
మామకు గన్నులిచ్చి సుతు మన్మథు పత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్నుడయ్యెడిన్.

కం. సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపమున కిద్దరాండ్రా
పరమేశ్వర గంగ విడుము పార్వతి చాలున్.

3 వ్యాఖ్యలు:

బ్లాగేశ్వరుడు చెప్పారు...

కొద్దిగా పద్యవివరణ ఇవ్వరూ.

కొత్త పాళీ చెప్పారు...

Beautiful.
మొదటిది ఇంతకు ముందు చూళ్ళేదు ఎక్కడా. బాగుంది.

మొదటిది ఇంతకు ముందు చూళ్ళేదు ఎక్కడా. బాగుంది.

బ్లాగేశ్వరా, నాకు తెలిసినంతలో ..
మామను సంహరించి = కంసుణ్ణి,యొక మామకు గర్వమడంచి = రుక్మిణి ??, యన్నిశా
మామను రాజుజేసి = చంద్రుణ్ణి, యొక మామ తనూజున కాత్మబంధువై = ఇంద్రుని కొడుకైన అర్జునునికి,
మామకు గన్నులిచ్చి = ధృతరాష్ట్రునికి, సుతు మన్మథు పత్నికి దానె మామయై = అర్ధం సువిధమే,
మామకు మామయైన = తన భార్య లక్ష్మి కి తండ్రి సముద్రుడు, తన కూతురైన గంగకి భర్త కూడా కావటం వల్ల ఒకే సారి తనకి మామ, అల్లుడు, పరమాత్ముడు మాకు బ్రసన్నుడయ్యెడిన్.

రాఘవ చెప్పారు...

ఒక మామకు గర్వమడంచి అంటే యిక్కడ కృష్ణుని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మామైన జాంబవంతునితో పోరాడి ఆతని గర్వమణచినది (రాముడి గురించి చెప్పేటప్పుడు సముద్రగర్వభంగం గురించి) చెప్పుకోవాలి.