అనగనగా నొకండు తన యాలులు నల్వురితో ముదంబునన్
ధనము సమృద్ధిగాఁ గలిగి ధాత్రిఁ వసించెను తృప్తచిత్తుఁడై;
తనకుఁ గనిష్ఠభార్య యనఁ దక్కిన భార్యలకంటె మోజు కా
వున సమకూర్చునామెకు నమోఘములైన విలాసవస్తువుల్ ౧
మనమున నుండు గౌరవపుమక్కువచేతఁ దృతీయభార్యనున్
జనులకుఁ జూపి తా మిగుల సంతసమొందును; కాని, డెందమం
దున నొక భీతి యుండెడిది దుర్గతి నాయమ నిల్వదంచు, పా
రుననియు వేఱు వ్యక్తికయి (చోటికని), రోదన లెవ్వియు నాపరావనీ ౨
అనుపమసౌమ్యమూర్తి మధురాప్తసుహృన్మణిదీప్తి నింటిమం
త్రిని ననువర్తినిన్ తన ద్వితీయకళత్రముఁ జూచుఁ బ్రీతితో;
ననుదినమున్నతిన్ పతికి నాదరగౌరవవృద్ధిఁ గోరు భా
ర్యనుఁ దన జ్యేష్ఠజాయను నిరాదరణన్ మరచెన్ మదంబునన్ ౩
దినములు దొర్లె... జబ్బువడి దీనదశన్ మదిఁ జింత సల్పి "నా
మనుగడ కొచ్చె ముప్పు, యికఁ గ్ష్మాపయి నూకలు చెల్లె!" నంచు నెం
చిన తరుణానఁ జిన్నసతిఁ జెంతకు రమ్మని "తోడు వత్తువా?"
యని యడిగెన్ వివిక్తమున నామె చివాలున లేచి "రా"ననెన్ ౪
"ప్రణతులు నీకు! నెవ్వరును ప్రాణము పోయెడు కాలమందు ర
మ్మని పిలువంగఁబోరు! మతి మాలెను నీ!" కని పల్కె; నిట్టులే
చినసతులందఱూ పలుకఁ ఛిన్ననిరీక్షణుఁడైన వానికిన్
వినఁబడె నొక్క మాట తన వెంబడి "వత్తు"ననంచు నెప్పుడూ ౫
కనులు చెమర్చె కాంచుటకుఁ గష్టమయెన్ తుదకున్ కనుంగొనెన్
కని తన దొడ్డభార్య నటు "గర్వవశంబునఁ గాంచకుంటి నీ
ఘనతరమానినీమణిని, గౌరవమీయగనైతి" నంచు శో
కనతహృదంతరంగుడయి కై గొని చేతుల నుంచె చేతులన్ ౬
* * *
జననమునాటిభార్య మృతిజన్మవిమోచక మాత్మవస్తుచిం
తన యని, యామెగాక మఱి తక్కిన వార లసత్యమైనవౌ
మన పరివారమిత్రగణ మాదరకీర్తిధనాదిబంధముల్
తను వని గుర్తెఱెంగుట సదా సుఖదంబని గుర్తు చూడగా ౭
20 కామెంట్లు:
అద్భుతం.
ఆత్మవస్తుచింతన!!
పద్యాలూ, కథా, సందేశమూ - అన్నీ అత్యద్భుతం.
పూర్తి ద్రాక్షాపాకముతో మృదుమధురంగా ఉన్నాయండి మీ పద్యాలు.కొనసాగించ గలరు.
After longtime.Good to read these.
I want to whether these padyaalu are translated from samskrutam?If so can you pleasepost the link for the oroginal ones.
ఆసక్తికరంగా ఉంది. ఈ కథ ఏదైనా పురాణంలోదా?
పద్యాలు బాగా రాశారు.
బావుందండి! రాసిన వారు..?
బావుందండి! రాసిన వారు..?
@కృష్ణుడు, కొత్తపాళీ నారాయణస్వామి, మందాకిని గార్లు:
ఈ వస్తువు పురాణేతిహాసాలలో ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలీదండీ. నేను చూసిన మూలం... నాకు ఇంగ్లీషులో వచ్చిన ఒక ఈ-ఉత్తరం. దానికి ఎందుకో తెలుగులో వ్రాసుకుందామనిపించింది. ఆ ఆంధ్రీకరణమే ఇది.
మురళిగారూ, బాలకృష్ణమూర్తిగారూ, నమోవాకం. అన్నట్టు, ఆత్మవస్తుచింతన అని ఆ ఆంగ్లమూలంలో లేదు. అందులో soul (ఆత్మవస్తువు) అని వాడారు. నాకు అది పెద్దగా రుచించక, సనాతన భారతీయ చింతనకి తగ్గట్టుగా ఆత్మవస్తుచింతనగా మార్చి వ్రాసాను.
చక్కని ధారతో మధువచస్సుమగంధముతో మనస్సులో
నొక్క ప్రగాఢచింతన సముద్భవమందగ జేయు భావమున్
జిక్కని కైతరూపమున జెప్పిరి యొప్పగురీతి భేషు భేష్!
ఒక్కటె శంక,యిట్టి తలపొప్పగునే తమకీ వయస్సునన్? :-)
కామేశ్వరరావుగారూ,
ఇక్కలిలో విఘాతముల వెక్కువ ధర్మము కుంటి కావునన్
నిక్క మదేదియైన నది నేర్వవలెన్ చిఱుప్రాయ మప్పుడే
తక్కినచో గ్రహించవలెఁ దక్కినయప్పుడె విద్య నేలనన్
మొక్కని వంచినట్టు మఱి మొత్తముగా తరు వొంచలేముగా!
కాందంటారా?
రాఘవ గారు,
చాలా బావున్నాయండి.
కామేశ్వర రావు గారు,
మీ పద్య ప్రతిస్పందన గురించి ఎదురుచూస్తున్నాం
ఊదంగారు,
పాపం రాఘవని(ఎందుకో యీ సందర్భంలో "గారు" తగిలిస్తే ఎబ్బెట్టుగా ఉంది!) ఇంకా ఏడిపించడం ఎందుకని నేననుకుంటే, మీరు ఊరుకొనేట్టు లేరే :-)
వంచుట మంచిదె కానీ
కొంచెము వాటమును చూసుకొని లాగవలెన్
త్రుంచుకు పోకుండగ అని
ఇంచుక జాగ్రత్త హెచ్చరించితి నంతే :-)
రాఘవా, నా మాటలకేం గాని మీరిలా మంచి పద్య కవిత్వధారలని ఇంకా కురిపించాలని మనసారా కోరుకుంటున్నాను.
కామేశ్వరరావుగారూ, మీరు అలా అనేస్తే ఇక ఏమనగలను? :)
:) పద్యాలు బాగున్నాయి. వ్యాఖ్యలు కూడా రక్తి కట్టాయి.
భైరవభట్ల వారివలె ప్రశ్నొకటున్నది నాకు రాఘవా
ఆ రఘువంశజుల్ తమదు యౌవనమున్ విషయైషులేగదా
మీరిటు లేతప్రాయమునె మెండుగ తాత్వికచింతలో మరీ
దూరము పోదురేల! యువతోచితమౌ కవనమ్ములల్లకన్?! :)
చంద్రమోహన్‌గారూ, నేను నివృత్తిమార్గంలో ఏమీ వెళ్లడం లేదండీ. ప్రస్తుత పద్యాలు కేవలం నాకు నచ్చిన విషయం గుఱించి వచ్చిన ఒక ఈ-ఉత్తరం తాలూకా ఆంధ్రీకరణం. (నాకు స్ఫురించిన లేదా నేను ఆలోచించిన విషయం మాత్రం కాదు.)
రాఘవ గారు,
ఎప్పటిలాగే పద్యాలు చాలా బాగున్నాయి. అయితే రామయణంలో చిన్న పిడకల వేట. బహు భార్యత్వం రద్దయిన ఈ రోజుల్లో ఈ బాధలు ఉండవేమో?? ఉన్న ఒక్క భర్యనీ నలుగురుగా ఊహించుకోవాలి :-)
ఉన్న ఒక్క భార్య తన్నకుండిన చాలు
నలుగురాడవాండ్ర? తలకు నొప్పి.
పేంటు చొక్క తొడగ పెద్ద భార్యనుకొనుము
చీర కట్టినపుడు చిన్న భార్య :-)
శ్యామసుందర్ గారూ :)
భలే వున్నాయి పద్యాలూ, వ్యాఖ్యలూ.
ఒక చిన్న పద్యకావ్యం రాయగల సత్తా మీకు నిస్సందేహంగా వుంది రాఘవా. మన పురాణాల్లో నుంచి ఏదైనా మంచి కథనెంచుకొని పద్యాల మధ్య కాస్త వచనాన్ని కూడా చొప్పించి ఒక ఆఖ్యానమో ప్రహసనమో లఘునాటికో మీరు రాస్తే చూడాలనుంది.
రామనాథులవారూ, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కానీ సమీప భవిష్యత్తులో నేను ఎలాంటి బృహత్కార్యాలూ తలపెట్టకూడదు అనుకుంటున్నానండీ. ఇంతకు ముందు ఎప్పుడో ఎత్తుకున్న శతకమే ఇంతవరకూ పూర్తి కాలేదు...! :)
In his comment Krishnudu garu wanted to know if these padyamulu are translated from Samskrutam.I read some where a story of a man with four wives.I give below the story which might be source for this post.
THE MERCHANT WITH FOUR WIVES
There was a rich merchant who had 4 wives. He loved the 4th wife the
most and adorned her with rich robes and treated her to delicacies. He
took great care of her and gave her nothing but the best. He also
loved the 3rd wife very much. He was very proud of her and always
wanted to show off her to his friends. However, the merchant is always
in great fear that she might run away with some other men. He too,
loved his 2nd wife. She is a very considerate person, always patient
and in fact is the merchant’s confidante. Whenever the merchant faced
some problems, he always turned to his 2nd wife and she would always
help him out and guide him through difficult times. Now, the
merchant’s 1st wife is a very loyal partner and has made great
contributions in maintaining his wealth and business as well as taking
care of the household. However, the merchant did not love the first
wife and although she loved him deeply, he hardly took notice of her.
One day, the merchant fell ill. Before long, he knew that he was going
to die soon. He thought of his luxurious life and told himself, “Now I
have 4 wives with me. But when I die, I’ll be alone. How lonely I’ll
be!” Thus, he asked the 4th wife, “I loved you most, endowed you with
the finest clothing and showered great care over you. Now that I’m
dying, will you follow me and keep me company?” “No way!” replied the
4th wife and she walked away without another word. The answer cut like
a sharp knife right into the merchant’s heart.
The sad merchant then asked the 3rd wife, “I have loved you so much
for all my life. Now that I’m dying, will you follow me and keep me
company?” “No!” replied the 3rd wife. “Life is so good over here! I’m
going to remarry when you die!” The merchant’s heart sank and turned
cold. He then asked the 2nd wife, “I always turned to you for help and
you’ve always helped me out. Now I need your help again. When I die,
will you follow me and keep me company?” “I’m sorry, I can’t help you
out this time!” replied the 2nd wife. “At the very most, I can only
send you to your grave.” The answer came like a bolt of thunder and
the merchant was devastated.
Then a voice called out, “I’ll leave with you. I’ll follow you no
matter where you go.” The merchant looked up and there was his first
wife. She was so skinny, almost like she suffered from malnutrition.
Greatly grieved, the merchant said, “I should have taken much better
care of you while I could have !”
Actually, we all have 4 wives in our lives ……. The 4th wife is our
body. No matter how much time and effort we lavish in making it look
good, it’ll never leave with us when we die. Our 3rd wife ? Our
possessions, status and wealth. When we die, they all go to others The
2nd wife is our family and friends. No matter how close they have been
there for us when we’re alive, the furthest they can go with us is up
to the grave. BOTTOMLINE! “The 1st wife is in fact our soul, often
neglected in our pursuit of material wealth and sensual pleasure.
Guess what ? It is actually the only thing that follows us wherever we
go. Perhaps it’s a good idea to cultivate and strengthen it now rather
than to wait until we’re on our death-bed to lament.”
కామెంట్‌ను పోస్ట్ చేయండి