మంగళవారం, నవంబర్ 20, 2007

అర్ధనారీశ్వరస్తోత్రమ్

సీ.సంపెంగసుమవర్ణసౌందర్యలహరీమె కర్పూరసమవర్ణకాంతియతడు
ముత్యాలజడగలముగ్ధమోహనవేణి జటలుగట్టినజుట్టుజంగమయ్య
కస్తూరితిలకంపుకాంతినిండినమోము భవనాశకుడుచితాభస్మధారి
కవులెల్లకొలిచేటికలికిమీనాక్షమ్మ ప్రమథగణవిభుడుప్రథితమూర్తి

ఆ.వె.ఘల్లుఘల్లుమనెడిగజ్జెలూగాజులూ
పసిడినగలతోడిపార్వతమ్మ
సర్పనూపురములుశంకరుమెడలోన
బుస్సుమనెడిపామెభూషణంబు

సీ.కలువరేకులవంటికన్నులుగలదీమె పద్మలోచనములవాడుశివుడు
పద్మయుగళనేత్రిమాయమ్మగిరిపుత్రి మూడుకన్నులపూర్ణపురుషుడతడు
మందారసుమమాలనామెకొప్పునబెట్టె మెడనుపుఱ్ఱెలమాలవేసెనితడు
దివ్యాంబరములీమె దిగ్వస్త్రమాయన జలదనీలచికురి జటలశివుడు

ఆ.వె.దేవిరూపరహిత దేవదేవుడితడు
ఈమెసృష్టిజేసె నితడులయము
జగతికంతజనని జగదేకజనకుడు
శుభమునిచ్చుగాత ఉమయుశివుడు

अर्धनारीश्वरस्तोत्रम्

चाम्पेयगौरार्धशरीरकायै कर्पूरगौरार्धशरीरकाय।
धम्मिल्लकायै च जटाधराय नमश्शिवायै च नमश्शिवाय॥

कस्तूरिकाकुङ्कुमचर्चितायै चितारजः पुञ्जविचर्चिताय।
कृतस्मरायै विकृतस्मराय नमश्शिवायै च नमश्शिवाय॥

झणत्क्वणत्कङ्कणनूपुरायै पादाब्जराजत्फणिनूपुराय।
हेमाङ्गदायै भुजगाङ्गदाय नमश्शिवायै च नमश्शिवाय॥

विशालनीलोत्पललोचनायै विकासिपङ्केरुहलोचनाय।
समेक्षणायै विषमेक्षणाय नमश्शिवायै च नमश्शिवाय॥

मन्दारमालाकलितालकायै कपालमालाङ्कितकन्धराय।
दिव्याम्बरायै च दिगम्बराय नमश्शिवायै च नमश्शिवाय॥

अम्भोधरश्यामलकुन्तलायै तटित्प्रभाताम्रजटाधराय।
निरीश्वरायै निखिलेश्वराय नमश्शिवायै च नमश्शिवाय॥

प्रपञ्चसृट्युन्मुखलास्यकायै समस्तसम्हारकताण्डवाय।
जगज्जनन्यै जगदेकपित्रे नमश्शिवायै च नमश्शिवाय॥

प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापन्नगभूषणाय।
शिवान्वितायै च शिवान्विताय नमश्शिवायै च नमश्शिवाय॥

एतत्पठेदष्टकमिष्टदं यो भक्त्या स मान्यो भुवि दीर्घजीवी।
प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात्सदा तस्य समस्तसिद्धिः॥

16 కామెంట్‌లు:

బ్లాగేశ్వరుడు చెప్పారు...

శంకరభగవత్పాదుల అర్థనారీశ్వర స్తోత్రము స్పూర్తిగా తీసుకొని వ్రాసారా. చాలా బాగుంది. మీకు సంస్కృత పాండిత్యము ఉన్నదా?

గిరి Giri చెప్పారు...

నా అభిప్రాయమిక్కడ

రాఘవ చెప్పారు...

@బ్లాగేశ్వరులవారు: నాకు సంస్కృతపాణ్డిత్యమేమీ లేదండీ... యేదో కొంచెం పరిచయం అంతే.

@గిరిగారు: నేనేదో ఆదిశంకరుని అర్థనారీశ్వరస్తోత్రాన్ని ఆంధ్రీకరిస్తే దానిపై కూడా వ్యాఖ్యానమంటే ఆశ్చర్యం వేస్తోంది. మీ పద్యాలపట్టుదలకు జోహార్లు.

అజ్ఞాత చెప్పారు...

రాఘవ గారు,

చాలా బాగా సరళీకరించి రాసారు.

గిరి Giri చెప్పారు...

రాఘవా, ఈ స్తోత్రమాల సంస్కృతంలో ఉందనే విషయం నాకు తెలియదు. అంత అందమైన స్తోత్రాన్ని అంధ్రీకరించడం ప్రశంశనీయం - పద్యాలు నాకు చాలా నచ్చాయి.

"అర్ధ" సరేమో, artha కాదేమో?

రాఘవ చెప్పారు...

గిరిమహాయశా, మీరు చెప్పినది ముమ్మాటికీ వొప్పే. అర్ధనారీశ్వరుడు అన్నది సరైన వాడుక. అర్థనారీశ్వరుడంటే తప్పే. నేను గమనించనేలేదు తప్పుని యింతవరకూ. దిద్దుకుంటాను... కృతజ్ఞతలు.

బ్లాగేశ్వరుడు చెప్పారు...

అర్థనారీశ్వరుడు = correct
అర్ధనారీశ్వరుడు = tappu

http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%85%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81&display=utf8&table=brown

రాఘవ చెప్పారు...

బ్లాగేశా, బ్రౌణ్యనిఘంటువులో వున్న "అర్థనారీశ్వరుడు" ముద్రారాక్షసమైయుండొచ్చు. అర్ధము = సగము (ఉదా. అర్ధరూపాయి); అర్థము = భావము,డబ్బు (ఉదా. ప్రతిపదార్థం,అర్థశాస్త్రం). మీరే చెప్పండి యేది సరియైనదో.

krishna చెప్పారు...

చాలా చాలా బాగ రాశారు.
అలాగే సంసృత స్త్రోత్రం కూడా అప్ లోడ్ చేస్తే బాగుంటుంది.

రాఘవ చెప్పారు...

@కృష్ణుడు గారు
మీరన్నట్లుగానే సంస్కృతస్తోత్రాన్ని జతజేశాను. లోగడ యిలానే శివమానసపూజాస్తోత్రాన్నికూడా తెనిగించాను, వీలైతే చూడండి.

బ్లాగేశ్వరుడు చెప్పారు...

అయ్యా క్షమించండి కొద్దిగా బుఱ్ఱ పెట్టి ఆలోచన చేయవలసినది. బ్రౌణ్య నిఘంటువు ముద్రించిన ముద్రాక్షరశాల రెండు తప్పు ముద్రాక్షరాలు ముద్రిస్తుందని అనుకోలేదు. క్షమించంది. సంస్కృత వర్ణక్రమాన్నైనా నేను గమనించి ఉందవలసినది. అందుకే తొందర తగదు అంటారు. ధన్యవాదాలు.

బ్లాగేశ్వరుడు చెప్పారు...

ఆదిశఙ్కరాచార్య కృత శివ మానస పూజా స్తోత్రముఇప్పుడే చూశాను చాలా బాగున్నది

రాఘవ చెప్పారు...

అయ్యయ్యొ యిదేమంత పెద్దవిషయమేమీ కాదండీ. ఇంతమాత్రానికే క్షమాపణలెందుకు??? మొదట నేను కూడా పొరబడ్డాను (మీకు తోడు నేనున్నాగదా). తప్పు తెలుసుకోకపోతే అనుకోవాలిగానీ భాషనేర్చుకుంటున్నాంగదా పర్వాలేదు. మన ఆంధ్రసంస్కృతమాతలేకదా... అర్థంజేస్కుంటార్లెండి.

చదువరి చెప్పారు...

గొప్పగా రాసారండి, చాలా బాగున్నాయి.

Mallik చెప్పారు...

యెంతో బాగున్నాయి. శివార్పణమస్తు.

రాఘవ చెప్పారు...

అస్తు.