శ్లో. జయ జయ దానవదారణకారణ శార్ఙ్గ రథాఙ్గ గదాసిధరా
జయ జయ చన్ద్ర దినేన్ద్ర శతాయుతసాన్ద్రశరీర మహత్ప్రసరా
జయ జయ తామరసోదర సోదర చారు పదోజ్ఝిత గాఙ్గఝరా
జయ జయ కేశవ కౌశినిషూదన శౌరి శరజ్జలజాక్ష హరీ.
[దారణ = చంపు,నిర్మూలించు; రథాఙ్గ = చక్రం; అసి = కత్తి; దినేన్ద్ర = సూర్యుడు; అయుత = పదివేలు(అనేకం); సాన్ద్ర = ఘన; మహత్ = గొప్పతనం; తామరసోదర = ఉదరమునుండి పుట్టిన తామరపువ్వు కలవాడు - విష్ణువు; ఉజ్ఝిత = emitted; ఝరము = ఝరి,ప్రవాహము; శరజ్జలజాక్ష = శరత్కాలంలో వికసించిన కలువలవంటి కన్నులు కలిగిన]
3 కామెంట్లు:
chaalaa thanks. SPB gaaru andamgaa paadina ee slokam ardham ippudu telisindi.
idi evaru raasindi? emainaa vivaraalu telusaa?
నేననుకోవటం వేటూరి సుందరరామమూర్తి గారు వ్రాసినదిది.
ఇది మనుచరిత్రలోనిది. దీన్ని రచించింది అల్లసాని పెద్దన. ఇది కవిరాజవిరాజితం అనే ఛందం. దీంట్లో ప్రతి పంక్తికి వరుసగా 6 జగణాలు ఉంటాయి. వేటూరి దీన్ని రాయలేదు. ఆ సినిమాలో మిగతా పాటలు రాశాడు. ఇది పూర్వకవికృతం కాబట్టి టైటిల్స్ లో పెద్దనగారి పేరు వేసి ఉండరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి