విరిమధువు గ్రోలు తుమ్మెద - లో గ్రో కి ముందున్న వు ని లఘువు గా భావించాలా ? నాకు ర వత్తు తో ఎప్పుడూ తికమక. పరి ధ్యానించి - IUU UI మొదటిది యగణం అవుతుంది సరిదిద్దగలరు.
నేనూ ఈ మధ్యే కందం రాయడం మొదలు పెట్టాను. నా పద్యాలు చూసి అభిప్రాయం తెలుపగలరు. రాకేశ్
(1)సంయుక్త,ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం వొకే పదంలోనిది అయితే అది గురువు అవుతుంది. ఉదా: "అక్షరం" లో అ గురువు. (2)సమాసపదంలో ఉత్తరపదంలోని మొదటి అక్షరం సంయుక్తాక్షరంగానీ ద్విత్వాక్షరంగానీ అయితే పూర్వపదంలోని చివరి అక్షరం గురువు. కాకపోతే ఆ సమాసం సంస్కృతసమాసంగానీ, మిశ్రసమాసంగానీ అయివుండాలి. సంస్కృతసాధ్యసమాసంలోనూ మిశ్రసమాసంలోనూ పూర్వపదాన్త్యాక్షరాన్ని లఘువుగా కూడా తీసుకోవచ్చు. సంస్కృతసిద్ధసమాసంలో మాత్రం యిది వర్తించదు. ఆ సమాసం తెలుగుసమాసమైతే (ఆచ్ఛికమైతే) గనుక పూర్వపదంలోని చివరి అక్షరం గురువు గాదు. ఉదా: "శంఖధ్వానం"లో ఖ గురువు, "యదుపతిస్తవము" లో తి గురువు లేదా లఘువు, "ముదుసలివ్యాఘ్రము"లో లి గురువు లేదా లఘువు, "ఇంటిప్రక్కన"లో టి లఘువు. (3)సమాసం లేకపోతే ముందుపదంలోని చివరి అక్షరానికి యీ సూత్రం వర్తించదు. ఉదా: "అదితెలిసి వ్యాసుడు" లో సి లఘువే.
ఇప్పుడు నేను వ్రాసిన పద్యంలో "పరి ధ్యానించెద"లో రిని గురువుగానైనా లఘువుగానైనా తీసుకోవచ్చు. తప్పులేదు. మనం పలకటాన్ని బట్టి.
2 కామెంట్‌లు:
విరిమధువు గ్రోలు తుమ్మెద - లో గ్రో కి ముందున్న వు ని లఘువు గా భావించాలా ? నాకు ర వత్తు తో ఎప్పుడూ తికమక.
పరి ధ్యానించి - IUU UI
మొదటిది యగణం అవుతుంది సరిదిద్దగలరు.
నేనూ ఈ మధ్యే కందం రాయడం మొదలు పెట్టాను. నా పద్యాలు చూసి అభిప్రాయం తెలుపగలరు.
రాకేశ్
కం.లలితముగ గద్యమందున
తెలుగులొ చందస్సులోని తికమకలన్నీ
తెలిసినదెల్లను (తెలిసిన మేరకు) తెలిపెద
అలసట యెరుగకనె వినుడు రాకేశ్ గారూ.
(1)సంయుక్త,ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం వొకే పదంలోనిది అయితే అది గురువు అవుతుంది.
ఉదా: "అక్షరం" లో అ గురువు.
(2)సమాసపదంలో ఉత్తరపదంలోని మొదటి అక్షరం సంయుక్తాక్షరంగానీ ద్విత్వాక్షరంగానీ అయితే పూర్వపదంలోని చివరి అక్షరం గురువు. కాకపోతే ఆ సమాసం సంస్కృతసమాసంగానీ, మిశ్రసమాసంగానీ అయివుండాలి. సంస్కృతసాధ్యసమాసంలోనూ మిశ్రసమాసంలోనూ పూర్వపదాన్త్యాక్షరాన్ని లఘువుగా కూడా తీసుకోవచ్చు. సంస్కృతసిద్ధసమాసంలో మాత్రం యిది వర్తించదు. ఆ సమాసం తెలుగుసమాసమైతే (ఆచ్ఛికమైతే) గనుక పూర్వపదంలోని చివరి అక్షరం గురువు గాదు.
ఉదా: "శంఖధ్వానం"లో ఖ గురువు, "యదుపతిస్తవము" లో తి గురువు లేదా లఘువు, "ముదుసలివ్యాఘ్రము"లో లి గురువు లేదా లఘువు, "ఇంటిప్రక్కన"లో టి లఘువు.
(3)సమాసం లేకపోతే ముందుపదంలోని చివరి అక్షరానికి యీ సూత్రం వర్తించదు.
ఉదా: "అదితెలిసి వ్యాసుడు" లో సి లఘువే.
ఇప్పుడు నేను వ్రాసిన పద్యంలో "పరి ధ్యానించెద"లో రిని గురువుగానైనా లఘువుగానైనా తీసుకోవచ్చు. తప్పులేదు. మనం పలకటాన్ని బట్టి.
మీ పద్యాలు చదివి అభిప్రాయం తప్పక తెలియజేయగలను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి