ఆదివారం, ఫిబ్రవరి 18, 2007

ఆరువేల నియోగులపై శ్రీ దేవులపల్లి వారి ఛలోక్తి

ఆ.వె. ఆరువేల కొంపలంటించె నయగారు
ఆరువేల వేరె యప్పు జేసె
అతడుగాక యెవ్వడారువేల నియోగి
విశ్వదాభిరామ వినుర వేమ
దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి

4 కామెంట్‌లు:

Valluri Sudhakar చెప్పారు...

దేవులపల్లి వారినడ్డంపెట్టుకోని నియోగులమీదేందుకండి నిష్టూరాలు?

బాక్సర్ చెప్పారు...

ఢాం ఢూం!! నేనొప్పుకోను. మీఉద్దేశం యేంటి? అస్సలు బ్రాహ్మనిజం కనుమరుగౌతుంటే ఇంకేంటండి ఆరు వేలు పమ్నెండు వేలు అని.

రాఘవ చెప్పారు...

ఇది నేను వ్రాసిన పద్యం కాదు - నిజంగా శ్రీ దేవులపల్లి వారిదే. ఈ పద్యం మృణాళిని గారి "తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు" అనే పుస్తకం నుండి తీసుకొనబడింది. నాకు తెలిసిన ఒక "ఆరువేల నియోగి" స్నేహితునికి చెప్పదలచి ఇక్కడ వుంచానంతే (బ్రాహ్మణుల లేదా ఇంకా చెప్పాలంటే నియోగుల ఆత్మగౌరవాన్ని కించపరచాలన్న వుద్దేశం నాకు యెంతమాత్రమూ లేదు). బహుశా యిది యే శ్రీ శ్రీ వంటి వారిపై దేవులపల్లి వారు చెప్పినదై వుండవచ్చు (కానీ వారిలో యెవరు నియోగులో నాకు తెలియదు). ఎందుకంటే విశ్వనాథ, శ్రీ శ్రీ వంటి వారు యెవరినీ వదిలిన పాపాన పోలేదు, అందరికీ చురకలు అంటించారు. శ్రీ శ్రీ అయితే వొక సందర్భంలో దేవులపల్లి వారిపై చేసిన చమత్కార భాషణం: "టైముకు రావటం శాస్త్రీయం, టైముకు రాకపోవటం కృష్ణశాస్త్రీయం" అని. అలాగే (అదే పుస్తకం నుంచి) భావ కవులపై దేవులపల్లివారి చమత్కారాస్త్రం -
ఆ. మెరుగు కంటిజోళ్ళు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవి లేవు
కవితయందు తప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ వినురవేమ.

Anil Piduri చెప్పారు...

naaku baagaa nachchiMdi,ii
d.v.kRshNa Saastriiyamu.