బుధవారం, ఫిబ్రవరి 07, 2007

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - మంగళము కోసలేంద్రా

కం. మంగళము కోసలేంద్రా
మంగళము మహితగుణధర మహితనయపతీ
మంగళము రాకుమారా
మంగళములు సార్వభౌమ మా రామయ్యా.

श्लो॥ मङ्गलं कोसलेन्द्राय महनीय गुणाभ्धये।
चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम्॥

1 కామెంట్‌:

రాఘవ చెప్పారు...

మహితనయపతీ = మహి తనయ పతీ (లేక) మహిత నయ పతీ
[మహి = భూమి, తనయ = కుమార్తె, మహిత = గొప్ప, నయ = న్యాయము,అందము]