ఆప్యాయముగ గౌరవాదరంబులతోడ తాతగారూ యంచు దగ్గరయ్యి
గురువుగారూ యంచు కూర్చుని కృతులను పాడి మందిరమున భక్తులమయి
ఈ క్రొత్త పద్యము ఈ వేళ వ్రాసాను చూడండి అని చూపి స్ఫూర్తి పొంది
మనుమలంటూ మీరు మమ్మల్ని ప్రేమతో ఆశీర్వదించగా హాయినొంది
మేము తిరిగి వచ్చెడిలోపు మీరు మమ్ము
వదిలి తిరిగిరానట్టి త్రోవను చనిరట!
మాకు మంగళంపల్లి రామనరసింహ
మూర్తిగారు మీరొక్కరే! గుర్తులేదె?
మనుమలము బాధ పడమా
కనులందు తిరిగెడి నీళ్లు గద్గద స్వరమూ
కనలేదో! వినలేదో!
చనగా కైవల్యపథము జ్ఞప్తికి లేమో!
4 కామెంట్‌లు:
అయ్యయ్యో, రామనరసింహ మూర్తిగారు పరమపదించారా? ఆయనతో మాకు మంచి పరిచయమే ఉండేది. మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారు.
మీ బాధలో నేనూ పాలుపంచుకుంటున్నాను.
ఔనండీ మురళిగారూ. నాకు కూడా మొన్ననే తెలిసిందండీ. నాకూ, మా చెల్లాయికీ ఇది పిడుగులాంటి వార్తే... ఇద్దరమూ ఊళ్లో ఉండడంలేదు, ఇద్దరికీ ఆయనంటే బోలెడంత అభిమానం, ఇప్పుడు ఆయన లేరూ అంటే అప్రయత్నంగానే ఏడుపు తన్నుకొచ్చేసిందండీ.
yes - a generation is disappearing.
నిజమండీ... ఒక తరం వెళ్లిపోతోంది :(
కామెంట్‌ను పోస్ట్ చేయండి