గురువారం, జులై 30, 2009

శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం

శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే రసపదే సపదే పదే పదే॥

భావజజనకప్రాణవల్లభే సువర్ణాభే భానుకోటిసమానప్రభే భక్తసులభే।
సేవకజనపాలిని శ్రితపఙ్కజమాలిని కేవలగుణశాలిని కేశవహృత్కేళిని॥

శ్రావణపౌర్ణమీపూర్వస్థశుక్రవారే చారుమతీప్రభృతిభిఃపూజితాకారే।
దేవాదిగురుగుహసమర్పితమణిమయహారే దీనజనసంరక్షణనిపుణకనకధారే।
భావనాభేదచతురే భారతీసన్నుతవరే।
కైవల్యవితరణపరే కాఙ్క్షితఫలప్రదకరే॥

* * *

వసుప్రదే సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మి తుభ్యం నమః॥ పదే పదే సపదే॥ శ్ర్యుత్తమగుణశోభితా చ వరదా చాసౌ లక్ష్మీశ్చ శ్రీవరలక్ష్మీ। నమస్తుభ్యం తే నమః। వసూః ధనధాన్యసంతానసౌభాగ్యాదీన్ ప్రదదాతీతి వసుప్రదా। సారసమివ పద్మమివ పదమఙ్ఘ్రిః యస్యాస్సా సారసపదా। రసః శోభా యస్యాః పదే గమనే సా రసపదా। సం జ్ఞానం పం రక్షణాం దాతీతి సపదా। అత్ర జ్ఞానరక్షణే దేహీతి చార్థః। పదే పదే సదా సర్వత్ర॥

శ్రీవరలక్ష్మీ, సమస్తసౌభాగ్యాలనూ ఇచ్చే తల్లీ , కమలములవంటి పాదములు కలదానా, అడుగులయందు అందము కనబరచుదానా, ఎల్లప్పుడూ జ్ఞానాన్నీ రక్షణనీ ఇచ్చుదానా, నీకు నమస్కారము.

భావజస్య మన్మథస్య జనకః పితేతి భావజజనకః విష్ణుః తస్య ప్రాణవల్లభా ప్రియవధూః ఇతి భావజజనకప్రాణవల్లభా। సువర్ణ ఇవ ఆభా రుచిః కాన్తిః యస్యాస్సా సువర్ణాభా। భానూనామాదిత్యానాం కోటిః భానుకోటిః మానే గణనే సమేతి సమానా భానుకోటిభిః సమానా ప్రభా కాన్తిః యస్యాస్సా భానుకోటిసమానప్రభా। భక్తానాం అనాయాసేన లభ్యేతి భక్తసులభా। సేవకజనాన్ భృత్యగణాన్ పాలయతీతి సేవకజనపాలినీ। శ్రితేభ్యః నతేభ్యః పఙ్కజైః పద్మైః కలితాం మాలాం యా ధార్యతే సా శ్రితపఙ్కజమాలినీ। కేవలాః అనితరసాధ్యాః గుణాః యస్యాం సా కేవలగుణశాలినీ। కేశవస్య విష్ణోః హృత్కేళినీ మానసోల్లాసినీతి కేశవహృత్కేళినీ॥

మన్మథుడి తండ్రియైన విష్ణుమూర్తికి ప్రియురాలా, బంగారు మేనిఛాయ కలిగినదానా, కోటిసూర్యులకు మేటియైన కాంతి కలదానా, భక్తసులభురాలా, సేవకజనులను ప్రీతితో పాలించుదానా, సరోజమాలికను ధరించినదానా, అనితరసాధ్యమైన గుణసంపత్తి కలదానా, కేశవునికి మానసోల్లాసము కలిగించుదానా ... శ్రీవరలక్ష్మీ, నీకు నమస్కారము.

శ్రావణమాసే పౌర్ణమీతిథ్యాః పూర్వం సమీపే స్థితే శుక్రవారే శ్రావణపౌర్ణమీపూర్వస్థశుక్రవారే। ఏతస్మిన్ దినే। చారుః మనోజ్ఞా మతిః యస్యాస్సా చారుమతీ ఏతావత్ సర్వాభిశ్చ చారుమతీప్రభృతిభిః పూజితః సేవితః ఆకారః మూర్తిః యస్యాస్సా చారుమతీప్రభృతిభిఃపూజితాకారా। దేవాదిభిః గురుగుహేన సుబ్రహ్మణ్యేన చ సమర్పితః మణిమయహారః యయా ధార్యతే సా దేవాదిగురుగుహసమర్పితమణిమయహారా। దీనజనానామకిఞ్చనానాం సంరక్షణార్థం కనకం హేమం ధారేవ వృష్టీవ ప్రదానే నిపుణా చతురా ఇతి దీనజనసంరక్షణనిపుణకనకధారా। భావనానాం చిత్తవృత్తీనాం భేదనే నిరోధే చతురా నిపుణేతి భావనాభేదచతురా। భారత్యా వాణ్యా సన్నుతా బహుధా స్తుతా వరా ఉన్నతా శక్తిః భారతీసన్నుతవరా। కైవల్యం మోక్షం వితరణే దానే పరా నిమగ్నా కైవల్యవితరణపరా। కాఙ్క్షితం కామితం ఫలం ప్రదాయకః కరః వరదహస్తః యస్యాస్సా కాఙ్క్షితఫలప్రదకరా॥

శ్రావణపౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమునాడు (వరలక్ష్మీవ్రతము చేసికొనే రోజు) చారుమతులైన సువాసిన్యాదులచే పూజించబడుదానా, గురుగుహాదులచే ఈయబడిన మణిహారమును ధరించుదానా, దీనులను రక్షించుటయందు నిపుణురాలా, చిత్తవృత్తులను నిరోధించుటయందు చతురురాలా, సరస్వతిచే కొనియాడబడినదానా, కైవల్యాన్నిచ్చేదానా, కామితఫలములను ఒసగు వరదహస్తము కలదానా ... శ్రీవరలక్ష్మీ, నీకు నమస్కారము.

* * *

గురుగుహముద్రాఙ్కితా ముత్తుస్వామిదీక్షితస్య కృతిరియం శ్రీరాగరూపకతాళాభ్యాం గీయతే॥

9 కామెంట్‌లు:

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

సరైన సమయానికి చాలా చక్కని పోష్టు రాశారు. ధన్యవాదాలు. :)

కొత్త పాళీ చెప్పారు...

శబాషో!
ఆ రాసే వ్యాఖ్యానం కూడా సంస్కృతంలో రాయాలా???

రాఘవ చెప్పారు...

విజయ్‌గారూ, పండుగ శుభాకాంక్షలు, నెనర్లు.

నారాయణస్వామిగారూ, ఎందుకో సంస్కృతంలోనే వ్రాయాలనిపించిందండీ... పైగా ఇది ఒకరకంగా నేర్చుకున్న పిసరంత సంస్కృతాన్నీ కనీసం మర్చిపోకుండా ఉంచే ప్రక్రియ కదండీ. :)

అన్నట్టు, మేము శ్రీరాగంలో ఏమైనా నేర్పండీ అని మా సంగీతం మేస్టారిని (శ్రీ శిష్టా సూర్యనారాయణగారు) అడిగితే ఎందరో మహానుభావులు నేర్పుతానని, దానికంటే ముందు ఈ శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం నేర్చుకుంటే రాగం కాస్త నలుగుతుందీ అని దీనిని నేర్పించారండీ. అదిగో అప్పటినుంచీ ప్రతీ వరలక్ష్మీ శుక్రవారంనాడూ ఈ కృతి పాడుకోవడం అలవాటైపోయింది. :)

కామేశ్వరరావు చెప్పారు...

రాఘవార్యా,

చాలా ఆనందం కలిగింది. మంచి కృతిని వినిపించి చక్కగా వివరించారు ఉభయ భాషల్లోనూ.
చారుమతి అనే ఆవిడ వరలక్ష్మీ వ్రతం కథలో వస్తారు, మొట్టమొదట యీ వ్రతాన్ని లక్ష్మీదేవి చెప్పింది ఆవిడకేనట. అంచేత అక్కడ "చారుమతులైన సువాసిన్యాదులచే" అనే కాకుండా, "చారుమతి మొదలైన సువాసిన్యాదులచే" అని కూడా అర్థం వస్తుంది.

రాఘవ చెప్పారు...

ఔనా కామేశ్వరరావుగారూ, నాకు వరలక్ష్మీవ్రతపు కథ తెలియదండీ. మరొక విషయం తెలిసింది, చారుమతి అమ్మవారి భక్తురాలూ అని. బావుంది, బావుంది. :)

కామేశ్వరరావు చెప్పారు...

ఔను, అప్పుడే ఎలా తెలుస్తుంది. పెళ్ళయ్యాక మీ ఆవిడ వరలక్ష్మీవ్రతం చేసుకున్నప్పుడు మీరు కథ చదివితే అప్పుడు తెలుస్తుంది :-)

రాఘవ చెప్పారు...

కామేశ్వరరావుగారూ, :)

మరువం ఉష చెప్పారు...

రాఘవ, ఈ టపాలు చదవటం మానకున్నా మీకేమీ తెలుపలేనని ( ఈ అంశాలలో) మౌనంగా పోవటం అలవాటు. అపుడపుడూ వస్తుంటాను కనుక సమయానికి చూడలేకపోయాను. మరువపు కృతి ఇది [మానవ భాషలో సహజ రాగంలోనే సుమీఇ! :) ] నా జీవనమే వ్రతం, నీ దీవెనలె ఫలం! http://maruvam.blogspot.com/2009/07/blog-post_30.html
Feels so good so assured that it is never late to learn any looking at your language skills
పోతే అతడెవరు? http://maruvam.blogspot.com/2009/08/blog-post_08.html పట్ల మీ సద్విమర్శ/సాభిప్రాయానికై కాస్త కూతూహలంగా వుంది. ప్రయత్మించి నేనకున్న శైలిలో వ్రాసిన కవితది.

ఓలేటి వెంకట సుబ్బారావు చెప్పారు...

అత్యంత ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నందుకు ధన్యవాదాలండీ