శుక్రవారం, జులై 17, 2009

సంగీత కళానిధి శ్రీమతి "పట్టమ్మాళ్" గారికి

స్పష్టోచ్చారణతోనూ
సృష్టించే శిష్ట రాగ వృష్టులతోనూ
మృష్టాన్నం తిన్నట్టే
తుష్టులు కానట్టివారు దొరకరు ఒకరూ ౧

పట్టువి స్వరాలపుట్టవి
కట్టిపడేసావు నీదు గానాంబుధిలో...
ఇట్టాగా ముంచేదీ?
పట్టమ్మాళ్ నీకు వేల బాష్పాంజలిగళ్ ౨

5 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

పట్టమ్మాళ్ గారికి బాష్పాంజలి!

ఆమె స్వరంలో కట్టి పడేసేది ముందుగా స్ఫుటమైన ఉచ్చారణ. ఒక రకమైన కమాండ్. ఇది ఎమ్మెస్ గొంతులోకంటే ఆమె గొంతులో వివరంగా తెలుస్తుంది.

90 సంవత్సరాల ముదివగ్గు, సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన కళామయి...గౌరవంగా వీడ్కోలు చెప్పడమే చేయగలిగింది.

చంద్ర మోహన్ చెప్పారు...

సంగీత కళానిధికి కందాల అక్షరాంజలిగళ్, చాలా బాగున్నాయి. ముంచింది గానాంబుధిలోనేనా!

రవి చెప్పారు...

చిన్నప్పుడెప్పుడో "అవ్వయ్యార్" పాటలనుకుంటాను. చాలా బాగా నచ్చాయి. ఎవరని అని అడిగితే మా అవ్వ చెప్పింది "పట్టమ్మాళ్" గారని.

ఆవిడ ఆత్మ శాంతికై అంజలి ఘటిస్తున్నాను.

కొత్త పాళీ చెప్పారు...

cAlA bAguMdi rAghavA.
modaTi padyaM mUDO pAdAnni iLA mAristE?
మృష్టాన్నం తిని సం -

రాఘవ చెప్పారు...

సుజాతగారూ, నాకు వ్యక్తిగతంగా సుబ్బులక్ష్మిగారికంటె పట్టమ్మాళ్‌గారు అంటే అభిమానం ఎక్కువండీ. పైన (పద్యాలలో) చెప్పినవే కాకుండా వేరే కారణం వల్ల కూడా అయ్యి ఉండవచ్చునండీ... పట్టమ్మాళ్ గారికి ఆవిడ తమ్ముడు జయరామన్ గారు శిష్యుడు, ఆ జయరామన్ గారికి సంధ్యావందనం పూర్ణప్రజ్ఞారావుగారు (ఈయన సంధ్యావందనం శ్రీనివాసరావుగారి అబ్బాయి) శిష్యుడు. ఆయనకి నేను శిష్యుణ్ణి :)

చంద్రమోహన్‌గారూ, మీరు ఎలా అనుకుంటే అలాగండీ. ఆవిడ ముంచినది గతించక ముందు గానాంబుధిలోనూ, గతించిన తర్వాత అదనంగా దుఃఖాంబుధిలోనూను.

రవిగారూ, అవ్వయ్యార్ పాటలు నేను వినలేదండీ... వింటానుండండి. నెనర్లు.

క్రొత్తపాళీ నారాయణస్వామిగారూ, మృష్టాన్నంబును తిని సంతుష్టులు కానట్టివారు... బావుందండీ. ఎంతైనా రాజకవులు రాజకవులే :D