గిరిగారూ తెలుగులో కళ్యాణ అని వ్రాయొచ్చు ననుకుంటాను. మా కామేశ్వరరావు మేస్టారు కూడా అభ్యంతరం చెప్పలేదు. మీరన్నట్టుగానే ఇది దైవ సంకల్పమేమో... మొదటి పద్యం వ్రాసిన వెంటనే మరో పద్యం కూడా వ్రాయించుకున్నాడు మా శ్రీరామచంద్రుడు. తిలకించండి.
రెండు పద్యాలూ చాలా బావున్నాయి! మంచి ధార, పదాల పొహళింపు కుదిరాయి. మీకు మధ్యాక్కర నాడి దొరికినట్టే. మీ అమ్మగారూ, మీరు నమ్మిన రాముడూ మీ ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసేట్టు చూస్తారు. ప్రొసీడ్! ఒక్క మాట, శతకం కదా అని ఎవరికో నీతులు చెప్పాలని పనిగట్టుకు ప్రయత్నించకండి. మీ గుండెలో సహజంగా పొంగే భావావేశాన్ని మాత్రమే అక్షరబద్ధం చెయ్యండి.
నాయనా రాఘవ పద్య రీతులన్నిటినీ అలాక్సాండర్ లా అక్రమించేస్తున్నావుగా. నేను చాలా సేపు ప్రయత్నించాను నడక చాలా బాగుంది ఇదేం రీతా అని. నాకు అక్కరలు తెలియక పసిగట్ట లేక పోయాను.
నేను పద్యాలు వ్రాయడం నేర్చుకుంది వికీ నుండి. కాబట్టి నాలాంటి వారి కోసం అక్కరల మీద కందం పేజి మూసలో వాటినికూడా వ్రాసి పుణ్యం గట్టుకోవయ్య.
10 కామెంట్లు:
చాల బావుంది పద్యం. ఇది దైవ సంకల్పమే, ఇక నిర్విఘ్నంగా సాగిపొండి ముందుకు.."కమలాక్షు నర్చించు కరములు", "సిరికిం జెప్పడు" పద్యాలు తలచుకునేలా చేసారు.
ఓ చిన్న ప్రశ్న - కల్యాణ అని వ్రాయడం సరి కదా?
గిరిగారూ
తెలుగులో కళ్యాణ అని వ్రాయొచ్చు ననుకుంటాను. మా కామేశ్వరరావు మేస్టారు కూడా అభ్యంతరం చెప్పలేదు.
మీరన్నట్టుగానే ఇది దైవ సంకల్పమేమో... మొదటి పద్యం వ్రాసిన వెంటనే మరో పద్యం కూడా వ్రాయించుకున్నాడు మా శ్రీరామచంద్రుడు. తిలకించండి.
రెండు పద్యాలూ చాలా బావున్నాయి! మంచి ధార, పదాల పొహళింపు కుదిరాయి. మీకు మధ్యాక్కర నాడి దొరికినట్టే. మీ అమ్మగారూ, మీరు నమ్మిన రాముడూ మీ ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసేట్టు చూస్తారు. ప్రొసీడ్!
ఒక్క మాట, శతకం కదా అని ఎవరికో నీతులు చెప్పాలని పనిగట్టుకు ప్రయత్నించకండి. మీ గుండెలో సహజంగా పొంగే భావావేశాన్ని మాత్రమే అక్షరబద్ధం చెయ్యండి.
రాఘవ గారు,
గిరి గారు చెప్పినట్లు పోతన పద్యాలు గుర్తుకు వస్తున్నాయి.
I WISH YOU ALL THE BEST.
కామేశ్వరరావుగారూ
నేను అస్సలు నీతులు చెప్పాలనుకోలేదండి. మీరు చెప్పారు కాబట్టి ఇక మీద కూడా వాటి జోలికి వెళ్లను.
కృష్ణుడు గారూ
కృతజ్ఞతలు.
రాఘవా, చిన్న అనుమానం, పట్టి పల్లార్చాలని ఉద్దేశ్యం కాదు కాని, కరిరాజు కరమెత్తి మ్రొక్కడం - ఏనుగు ముంగాళ్ళనో, తొండాన్నో కరము లనడం సబబా?
అయ్యో ఎంతమాట...
కరము = చెయ్యి, తొండము, కిరణము
కరి అంటే కరము (తొండము) కలది కాబట్టి ఏనుగు అని, శీతకరుడు అంటే చల్లని కిరణములు కలవాడు అనగా చంద్రుడని అర్థాలు.
నాయనా రాఘవ పద్య రీతులన్నిటినీ అలాక్సాండర్ లా అక్రమించేస్తున్నావుగా. నేను చాలా సేపు ప్రయత్నించాను నడక చాలా బాగుంది ఇదేం రీతా అని. నాకు అక్కరలు తెలియక పసిగట్ట లేక పోయాను.
నేను పద్యాలు వ్రాయడం నేర్చుకుంది వికీ నుండి.
కాబట్టి నాలాంటి వారి కోసం అక్కరల మీద కందం పేజి మూసలో వాటినికూడా వ్రాసి పుణ్యం గట్టుకోవయ్య.
అలగ్జాండరూ కాదు అల్లసానిపెద్దనా కాదు. ఏదో పుర్రెకో బుద్ధి అని, నాకు మధ్యాక్కర వ్రాయాలనిపించింది అంతే.
అక్కరపాఠం చెప్తాను కానీ కొంచెం టైం కావాలి. ఒక నాథుడు ఒక నాడు ఒక పని నెరవేర్చమన్నాడు, అది పూర్తి చేసాకే అక్కరపాఠం. సరేనా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి