రామనాథుడు చెప్పిన యీ సమస్యకి నా పూరణమిది:
శా. ఆమోదాంకితచేల దివ్యహలయుక్తా రేవతీశా సుధీ
రామా రమ్యగుణోజ్జ్వలా శుభములన్ లాభంబులం బొందగా
రామారామవిరామరామశుకశ్రీరావాప్తశ్రోత్రేంద్రియా
రామా రామ పదాబ్జముల్ కొలువరారా కీర్తి మిన్నందురా.
నా చేత చాలా కాలం తర్వాత మళ్ళీ పద్యపదాన్ని పట్టించినందుకు రామనాథునికి కృతజ్ఞతలు.
3 కామెంట్‌లు:
కొలువరారా అని ఎవరికి చెబుతున్నారో తెలియకుండా వుంది. నన్ను మన్నించి ఈ పద్యానికి అర్థం చెప్పండి రాఘవకవీంద్రా.
మీరు అర్థం అడిగారంటే నేను పద్యం సరిగ్గా వ్రాయలేదని తెలుస్తోంది. అర్థం చెప్పకుండానే బాగ అర్థమయ్యేలా వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
ఆమోద సుగంధం, అంకిత కూడిన, చేల వస్త్రము, దివ్యహల గొప్ప నాగలియనే ఆయుధము (బలరాముని ఆయుధము), యుక్త కలిగిన, రేవతీశా రేవతీదేవి మగడా (బలరామా), సుధీ చక్కని బుద్ధికలిగినవారు, రామ రమింపజేయు, రమ్య మనోహర, గుణ సద్గుణములు, ఉజ్జ్వల ప్రకాశించే, శుభము భద్రము, లాభము వివిధైశ్వర్యసిద్ధి, పొందగా అందుకొనగా, రామ ఆహ్లాదకరమైన, ఆరామ తోటలు, విరామ విశ్రాంతి, రామశుక రామచిలుక, శ్రీరావ మంగళధ్వని, ఆప్త దగ్గరైన, శ్రోత్రేంద్రియ చెవి, రామ బలరామా, రామపదాబ్జముల్ శ్రీరామచంద్రుని చరణకమలములను, కొలువ పూజించుటకు, రారా రమ్ము, కీర్తి యశస్సు, మిన్ను ఆకాశం, అందురా చేరుతుంది.
నాకు అర్థం కానంత మాత్రాన మీరు సరిగా రాయకేం! ప్రతిపదార్థాలు యిచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సమస్యపై ఇంకోపూరణ వచ్చింది. గిరిగారు చేశారు. చూశారా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి