మంగళవారం, ఏప్రిల్ 08, 2008

नववर्षशुभाकांक्षाः

अस्मद्गुरुणा श्री पुल्लेल श्रीकृष्णमूर्तिना वदितः अयं श्लोकः --

पात्रस्खलितवृत्तीनां शास्त्रमार्गानुसारिणाम्।
योगकृत्क्षेमकृत्वस्स्यात् वर्षं श्रीसर्वधारि यत्।।

अन्वयक्रमः --
यत् वर्षं अस्खलितवृत्तीनां पातृ अमार्गानुसारिणां शास्तृ (तत्) श्री सर्वधारि वः योगकृत् क्षेमकृत् स्यात्।

తాత్పర్యం --
ఏ సంవత్సరమైతే చలింపని నడువడిక కలవారికి రక్షకత్వం వహిస్తున్నదో, మంచిమార్గాన్నవలంబించనివారిని శాసిస్తున్నదో (ఆ) సర్వధారి మీకు యోగాన్ని క్షేమాన్ని కలిగించునుగాక.

3 వ్యాఖ్యలు:

Sreenivas Paruchuri చెప్పారు...

రాఘవ-గారు,

నాకో సందేహం. మీరు అసలు పాఠాన్ని, అన్వయాన్ని నాగరి లిపిలో యెందుకు రాస్తారు? తెలుగులోనే రాయొచ్చుకదా! మీకు తెలియకపోదు, తెలుగుదేశంలో (ఆ మాటకొస్తే దక్షిణభారతంలో) సంస్కృత పండితులకు మొన్న మొన్నటి వరకు నాగరి లిపి చదవడం రాదు. అంతా తెలుగులిపిలోనే లభ్యమయ్యేది. సంస్కృతాన్ని నాగరిలో రాయడం 'కొత్త' పరిణామం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాగరి సమాజం వారు సాగించిన వుద్యమం ఈ మార్పుకు ఒక ప్రధాన కారణం.

భవదీయుడు,
పరుచూరి శ్రీనివాస్

రాఘవ చెప్పారు...

నిజమే శ్రీనివాస్‌గారూ మంచి సూచన చేసారు. తెలుగులోనే వ్రాయొచ్చు, కానీ అది సంస్కృతమని చూసీచూడగానే తెలుస్తుందని దేవనాగరిలో వ్రాసాను.

oremuna చెప్పారు...

నా వోటు కూడా తెలుగు లిపికే, ఈ నాగరి చదవడాం చాలా లేట్ అవుతుంది :(