గురువారం, నవంబర్ 15, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - మహిషాసురమర్దని

[ఇన్నాళ్లకి అమ్మకి వ్రాయించుకోవాలనిపించిందేమో! ఎప్పుడో వ్రాయవలసినది యిప్పుడు వ్రాస్తున్నాను.]

చం. ఱుగను నీదువైభవము యేమనుకోకు మదంబ, యింతకీ
కరమున శూలమెందులకు? కామము క్రోధము ద్రుంచు శక్తివై
శరణనువారికందరికి చక్కటి యండవు తోడునీడవై
సరగున బ్రోవువమ్మ "మహిషాసురమర్దని" దేవి యీశ్వరీ.

6 కామెంట్‌లు:

Soujanya చెప్పారు...

చాలా చక్కగా వచ్చిందీ పద్యం..మొన్నీమధ్యనే తెనాలి రామకృష్ణ చూసాను, అందులోనూ ఉంది ఇలాంటి ప్రశ్న..

రాఘవ చెప్పారు...

అలానాండీ? నాకు గుర్తులేదు... అయితే తెనాలిరామకృష్ణ మళ్లీ చూడాల్సిందే. కృతజ్ఞతలు.

అజ్ఞాత చెప్పారు...

(పై వ్యాఖ్య రాసింది నేను, గిరి)..నా ఇతర సగం గూగుల్లో లాగిన్ అయివున్నది గమనించలేదు.

అజ్ఞాత చెప్పారు...

తెనాలి రామకృష్ణ బలి ఇవ్వబడుతున్న జంతువును రక్షించి, ఆ తరువాత అమ్మని అడిగినప్పటి సంగతి. "ఎందుకమ్మ ఈ భయంకర అవతారము?" అంటూ ఇంకా చాలా అడుగుతాడు..మీరు రాసింది అది కాకపోయినా, "ఎందుకమ్మ చేతిలో శూలం?" అంటే అదే గుర్తుకొచ్చింది..అంతే

rākeśvara చెప్పారు...

చాలా బాగుంది

అమ్మ మా చేత ఎప్పుడు వ్రాయించుకుంటుందో. :)
మహ్(ఇషా)సూరు లోని మా ఇంటినుండి మహిషాసురమర్దిని కొలువైన చాముండి బెట్ట కనబడుతుంది.

గిరి Giri చెప్పారు...

రాఘవా, విఘ్నేశ్వర స్తుతి మరొకటి ఇక్కడ రాసాను, చివరి పాదంలో క్ష కి, చ కి యతి సరిపోతుందో లేదో అని అనుమానం పీడిస్తోంది - ఒక కన్నేసి, అనుమాన నివృత్తి చేయమని మనవి.