చూశాక...
ఉ.సూటిగ వొక్కమాట వినసొంపుగ పల్కగలేరు వీరు యే
ఆటలనాడలేరు మనభాషను నేర్వరు నేర్పబోయినన్
“కూటికి ఆంగ్లమైతె పనికొచ్చును, ఆంధ్రము తిండిబెట్టునా?
మేటిగ వుండగోరు మము మీరలు క్రిందకు ద్రోసివేతురా
వోటమి నోర్వనేర”మని పోరెడివారిని మార్చుటా? వృథా!
మ. నిజమే మాటలు చాలబోవు మన యీ నిట్టూర్పులే సాక్ష్యముల్
“అజుడైనా భయమొందు రీతిని తయారైయారు జాగ్రత్తరోయ్
విజిగీషాముఖులైతె? భాషకు నిలా వీడ్కోలు చెప్పొచ్చునా
ప్రజలారా” అని మొత్తుకుంటె తుదకున్ ప్రాయోజనంబున్నదా?
మ. అసలీ వైఖరి యెట్లు వచ్చె? మనమే గాదా సగం కారణం?
పసివారన్నది కూడ చూడక మహా భారంబులన్ నెత్తిపై
కసితో రుద్దుచు పెంచుచుంటిమి గదా కందోయి చల్లారగా
మసలే నైజము నేర్వలేద? మనలో నాత్రంబు లీడేరగన్.
* * *
కం.[నా]మీలోనున్న కసినిలా
యీలోకంమీద గ్రక్కి యిపుడిక చాలా
తేలికపడి హాయిగ కం
దంలోతుల మునిగితేలుదాం రారండోయ్.
6 కామెంట్లు:
ఉత్పలమాల, రెండు మత్తేభాలు, కొసరు ఓ కందం - చాలా బాగా (చకచకా) రాసేసారు.సరైన సమయానికి సరైన అంశం మీ మెదడుకి అందిందని అర్ధమవుతోంది..
నిజమేమరి... అంశందొరకటంలోనే వుంది విషయమంతా. పద్యం వ్రాయటమెంతసేపండీ, మీకు తెలియదా?
విజిగీషావనమందు నిల్చినచొX వీడ్కోలు చెప్పొచ్చునా
కసితో రుద్దుచు చోద్యమున్ గనుచుX కందోయి చల్లారగా
మసలే నైజము నేర్వలేద? మనX ఆత్రంబు లీడేరగన్.
X - గురువు అక్షరం ఉండాలి. (మూడు సార్లు ఒకే తప్పిదం జరిగింది!)
చాలా సులువుగా అర్థమయ్యి బాగున్నాయి.
"అంశందొరకటంలోనే వుంది విషయమంతా. పద్యం వ్రాయటమెంతసేపండీ"
మా(నా)కు అంశాలు చాలా వున్నాయి గానీ, పద్యాలు రాయడమే రావట్లేదు :)
ప్రావీణ్యం వుండాలిగా :(
రాకేశ్వరా, తప్పు సూచించినందులకు చాలా కృతజ్ఞుడను. పద్యపాదాలని తప్పక మారుస్తాను.
[ఈ క్రింది వాక్యాలను గడుసుతనం, వ్యంగ్యం మాటల్లోధ్వనించేలా చదువుకోండి]
చూశారా... మొదట వ్రాసిన వుత్పలమాల నా చేత యెంత పని చేయించిందో! మొదట మత్తేభపుగతి తర్వాత ఉత్పలమాలగతి మల్లీ తర్వాత మత్తేభగతి!!! ఓహో అధ్బుతం... దీనికి క్రొత్త పేరుకూడా పెట్టొచ్చేమో [గడసరిగా ఆలోచిస్తే] మత్తోత్పలేభమని.
"మల్లీ" కాదండి, పొరబాటు, "మళ్లీ" వ్రాయబోయి...
బాగు బాగు తమ్మీ.......
నువ్వలా కుమ్మేస్తూ ఉండు......
ఏదో రోజు నేను నీలాగా ఒక పద్యం రాస్తాను (నువ్వు నాకు నచ్చావ్ లో సునీల్ లాగా )
కామెంట్‌ను పోస్ట్ చేయండి