ఆదివారం, జూన్ 15, 2008

నాన్న

కం. కొంచెం భయమూ భక్తీ
కొంచెం మరియాద ప్రేమ కొంచెం గురినీ
కొంచెం గౌరవ మింకా
కొంచెం చనువు మమతలను కూడెను తండ్రై.

కం. పెంచుట నమ్మ చదువు నే
ర్పించుటను గురువు నడతను పితరుడు ప్రేమన్
పంచుటను సఖుడు... తండ్రిని
మించిన శ్రేయోభిలాషి మేదినిఁ గలడే?

ఉ. సంచిత వీర్యమిచ్చి నరజన్మ మొసంగి మహాజనాప్తమౌ
మంచిఁ గ్రహింపఁజేసి సుకుమార కుమారక కేలువట్టి యా
డించి సుభక్త ధీజన విధేయత నేర్పెడి దైవమా తలన్
వంచి నమస్కరింతుఁ శిశుపాలనకౌశల ఆత్మదాయకా.

పితృదినోత్సవ శుభాకాంక్షలు!

18 కామెంట్‌లు:

వికటకవి చెప్పారు...

సందర్భోచితంగా చక్కగా రాసారు.

సూర్యుడు చెప్పారు...

మనకి పితృదినోత్సవమున్నా లేకున్నా ఈ పద్యాలు చాలా బాగున్నాయి :)

krishna చెప్పారు...

ఈ కాలం తండ్రులందరూ శిశుపాలనకౌశలులు కాకపోతె మరి కష్టం కదా న్యుక్లియర్ కుటుంబాలలో .చాలా చక్కగా చెప్పారు.

పోతన పదాలు కొన్ని కనిపిస్తున్నాయి.

Unknown చెప్పారు...

మీ పద్యాలు బాగా వున్నాయి.వ్రాస్తూ వుండండి.

రాఘవ చెప్పారు...

అందరికీ కృతజ్ఞతలు :)

కొత్త పాళీ చెప్పారు...

మొదటి కందం మరీ బావుంది. చివరి పాదంలో .. మమత"లు"ను అని ఉంటే ఇంకా అర్ధవంతంగా ఉంటుంది.

కామేశ్వరరావు చెప్పారు...

మాతృదేవోభవ, పితృదేవోభవ అయ్యాయి, ఇక ఆచార్యదేవోభవ మిగిలుంది!
పద్యాలు బావున్నాయి, మొదటి చివరి పద్యాలు ఇంకా బావున్నాయి. కొత్తపాళీగారన్నట్టు "కొంచెం చనువూ మమతలు కూడిన, నాన్నే!" అంటే ఇంకా బావుంటుందేమో.

రాఘవ చెప్పారు...

నారాయణస్వామిగారూ, నిజమే సుమండీ. నేను గమనించలేదు. "మమతలు" అంటే ఇంకా బావుంది.

కామేశ్వరరావు మేఁష్టారూ, ధన్యవాకము. మీరెంత మా అధ్యాపకులైతే మాత్రం... "ఆచార్యదేవోభవ"కి (వచ్చేనెలలో రాబోయే) గురుపౌర్ణిమ వరకూ ఆగండి మరి :)

durgeswara చెప్పారు...

ముక్కుతిమ్మనార్యుని ముద్దుపలుకు లన నివియేనా అని అనిపించుచున్నది.

Soujanya చెప్పారు...

ఒకటే ప్రాసాక్షరం తో మూడు పద్యాలు బాగా వ్రాసారు..

రాఘవ చెప్పారు...

అమ్మో! తిమ్మన గారెక్కడండీ దుర్గేశ్వరరావు గారూ? తెనాలి రామయ్య అన్నట్టుగా నేను కనీసం జానపదుణ్ణి కూడా కదాయె. తిమ్మన్న గారి ప్రయోగాలు చూసి చాలా హాచ్చెర్యపడిపోయేస్తాను నేను.

సౌజన్య/గిరి గారూ, ఒకసారి కళ్యాణరామశతకం ప్రారంభించాక ఇదో పిచ్చి పట్టుకుంది నాకు -- వీలైన చోటల్లా ఒకటే ప్రాసాక్షరంతో పద్యాలు వ్రాయడం :)

కామేశ్వరరావు చెప్పారు...

రాఘవగారూ,
ఎంత మాట! మీరేదో ముచ్చటపడి మాష్టారూ అంటూ ఉంటే సరే మాటవరసకే అని అభ్యంతర పెట్టలేదు కానీ, నిజంగా నేను గురుస్థానానికి అర్హుడనని ఎప్పుడూ అనుకోలేదు, అనుకోనూ. నేనూ నిత్య విద్యార్థినే!

రాఘవ చెప్పారు...

కామేశ్వరరావు గారూ, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నాకు ఆచార్యతుల్యులే.

Aditya చెప్పారు...

థాంక్స్ :) ఇంకో ఒకటి రెండు ఇళయరాజా వీడియోలు ఉన్నాయి. అవి కూడా పెడతాను!

Bolloju Baba చెప్పారు...

పద్యాలు భావస్ఫోరకంగా ఉన్నాయి.
బొల్లోజు బాబా

రాఘవ చెప్పారు...

బాబాజీ, :)

Dr.Bharath Vyas Marla చెప్పారు...

chaala chakkaga vraasaru..
ebloggerlo telugu lipini ela vadalo cheppagalaru

అజ్ఞాత చెప్పారు...

mI "naanna " kavita bhaava sphOrakamugaa unnadi.chaMdO baddhamugaa raayaDamu valana ,svarNa siMhaasanamu mIda ,SIrshikanu ,kUrchO beTTaaru.
jaMdhyaala nuMDI
mati marupu poralalOniki jaaraipOnIyakuMDA ,ennO vishayaalanu maatR bhaashaama talli ki archanaa patrini aMdistuunna mii aviraLa kRshiki kRtajnatalu.

kaakataaLiiyamugaa ,
naa "naanna "(andhra folks.net " lO )kavita vachchenu . mI abhipraayamulanu ,vraaya gOruchunnaanu .
"vaagdEvi ",kusumakumari