మంగళవారం, సెప్టెంబర్ 11, 2007

కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగార్కి జయంతినివాళులు

ఊ.దుష్కరమైన ప్రాసలతొ దోచెను పండితమానసంబులన్
శుష్కిలుచున్న ఛందముకు శోభను దెచ్చెను ఆంధ్రసాహితీ
పుష్కరమందు నిల్చెగద పున్నమిచంద్రునిబోలురీతిలో
పుష్కల విశ్వనాథునికి పూలనివాళులు నాదు కైతలే.

11 కామెంట్‌లు:

  1. నిజంగానా? చాలా సంతోషం. చెప్పినందుకు థాంకులు. మీరూ దుష్కర ప్రాసనే ఎంచుకుని సమర్ధవంతంగానే సాధించారు - అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. దుష్కర ప్రాస అనగానే నాకు "ముష్కరులు" అన్నమాట తప్ప ఇంకోటి స్ఫురించదు :-)

    రిప్లయితొలగించండి
  3. "ఛందమునకు" అంటాం మామూలుగా...
    "ఛందముకు" కాస్త ఇబ్బందిగా ఉంది.
    "ఛందసుకు" అని మారిస్తే 'ఉ'త్పలమాలలో
    ఏదైనా దెబ్బతింటుందా రాఘవగారూ?

    రిప్లయితొలగించండి
  4. @kottapaaLi gaaru
    ee sOmavaaram viSwanaatha vaari jayanti.vivaaraalaku aandhrabhoomi "saahiti" cooDagalaru

    రిప్లయితొలగించండి
  5. ఈ పద్యం పుట్టడానికి ముఖ్యకారణం మళ్లీ మా లలితక్కయ్యే. లలితగారు చెప్పివుండకపోతే గనుక అసలు విస్వనాథ సత్యనారాయణగారి జయంతి సంగతి నాకు తెలిసేదే కాదు. లలితక్కా, కృతజ్ఞుణ్ణి.
    @క్రొత్తపాళీ: ధన్యో೭స్మి.
    @రామనాథ: మీరన్నట్లుగా "ఛందసు" అంటే వుత్పలమాలలో యేదీ దెబ్బతినదు. కాకపోతే, "ఛందస్" అనే సంస్కృతశబ్దంనుండి తెలుగులో "చందస్సు" అనే తత్సమం వుధ్భవించింది కాబట్టీ, చందస్సుని చందస్సుకోసమని చందసు అనటం నిజానికి అంత బాగోదేమోననిపించి చందము అని వాడాను తప్ప వేరే కారణమేమీ లేదు. :)

    రిప్లయితొలగించండి
  6. రాఘవ గారు,
    పద్యం బావుంది. పాశ్చాత్య సంస్కృతి ని వ్యతిరేకించినాయనకు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న జయంతి చేయటం చిత్రం. మీరు "పుష్కల విశ్వనాధునికి" అన్నారు, ఓ 50, 70 ఏళ్లు గడిచిన తరువాత, అప్పటికి తెలుగు చదవటం వచ్చిన వాళ్లు ఉంటే, ఇది చదివి, పుష్కల ఇంటిపేరు, విశ్వనాధసత్యనారయణ వారి పేరు అనుకుంటారేమో :(.

    అన్నట్టు మీరు గతం లో ఇచ్చిన రెండు సమస్యలకు పూరణలు ప్రయత్నించాను, పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  7. నిజమేనండోయ్, ఆ ప్రమాదం లేకపోలేదు... ప్చ్

    రిప్లయితొలగించండి
  8. రాఘవ గారు,
    దుష్కరమైన ప్రాస అన్నప్పుడు గణభంగం జరుగుతుందేమో? ఒక్కసారి చూడగలరు.

    గిరి

    రిప్లయితొలగించండి
  9. మీరన్నది నిజమే. నేను వ్యాఖ్య రాసిన తర్వాత ఛందస్సుమీద మరికొంత జ్ఞానప్రాప్తి జరిగింది - దాని వల్ల తెలిసింది.

    ఈ మధ్య కొత్త పద్యాలేవీ రాయడంలేదేమిటి?

    రిప్లయితొలగించండి
  10. లేదండీ, తప్పకుండా వ్రాస్తాను. వ్రాసే ఘడియలు రావాలంతే :)

    రిప్లయితొలగించండి