పదవ తరగతిలో వుండగా నా మిత్రుడు బందా శరవణ కార్తికేయకు నేను వ్రాసియిచ్చిన పద్యమిది:
ఉ.ఆపగ పారినట్లు హృది యా హరి మీదనె కల్గు భక్తియున్
ఏ పగ కల్గకుండ యిల ప్రేమను పంచెడిదైన స్నేహమున్
మాపుచు అంధకారమును మానవు మార్చెడిదైన విద్యయున్
ఆపదనుండినా విడువరానివిరా మనసైన నేస్తమా.
[ఆపగ = నది]
apaga - anTE nadi kadaa?
రిప్లయితొలగించండిaapaga - annaa kooDaa nadiyEnaa?
nirdhaarinchagalaru. dhanyOsmi.
ఆపగ అన్నా నదే. ఆపగ/అపగ రెండూ ఆప/అప నుండి వచ్చాయి. "ఆప" లేదా "అప" శబ్దాలకి అర్థం నీరు అని. "గ" గమనాన్ని సూచిస్తుంది. బ్రౌణ్య నిఘంటువులో యిది దొరకదు. :)
రిప్లయితొలగించండిha ha - good one about brouNya nighanTuvu.
రిప్లయితొలగించండిI didn't find aapamu in either Brown or Macdonell.
రిప్లయితొలగించండిPahlavi calls it: a quantity of water - not sure what it means.
ఈ మధ్యకాలంలో ఆప పదప్రయోగం తగ్గిందనే చెప్పొచ్చు. ఆప అన్న యీ సంస్కృత శబ్దం ఋగ్వేదకాలం నాటిది. తెలుగు నిఘంటువుల్లో అందునా internetలో వెతికితే ప్రయోజనం బహుశః వుండకపోవచ్చు. నిజమే నేనూ చూసాను - MacDonellలో లేదు, Pahlaviలో కూడా లేదు. కానీ ఋగ్వేదసూక్తాలలో ఆప/అప పదప్రయోగం వుంది, "ఆపః హి ష్ఠా మయొభువః" అనే జలసూక్తం దీనికి వుదాహరణ.
రిప్లయితొలగించండి