శుక్రవారం, జనవరి 05, 2007

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - మరి మరి అడిగెద

కం. మరి మరి అడిగెద నాకిల
వరములు యితరములు వలదు వారిజనయనా
నిరతముగ మదిని నీ శ్రీ
చరణకమలభక్తి నాకు చాలును రామా.

श्लो॥ वरं न याचे रघुनाथ युष्मत्पादाब्जभक्तिस्सततं ममास्तु।
इदं प्रियं नाथ वरं प्रयच्छ पुनःपुनस्त्वामिदमेव याचे॥

3 కామెంట్‌లు:

  1. మనసును మురిపించు మంచి ముత్యాల కొరకు
    మరి మరి వచ్చెద ఈ బ్లాగునకు
    తదుపరి అద్భుత పద్యముల కొరకు
    మరి మరి చదివి ఆనందించుట కొరకు

    రిప్లయితొలగించండి
  2. కం.ప్రోత్సాహపు పలుకులతో
    ఉత్సుకతను పెంచినారు - ఉల్లాసముతో
    తాత్సారము జేయక యీ
    వత్సరములొ పూర్తి జేస్తు పదిలముగ కృతిన్.

    రిప్లయితొలగించండి
  3. అమృతమంతటి సాహిత్యముంటే
    ఆనందించెడి అతిథులు ఉంటే
    ఆలస్యము చేయనని మీరంటే
    అంతా వుంటాం మీవెంటే

    రిప్లయితొలగించండి